PM Modi: జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్ధుల్లా గుజరాత్‌ సందర్శన.. ప్రధాని మోదీ ప్రశంసలు!

గుజరాత్‌ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో ఉన్న ఐక్యతా విగ్రహాన్ని సందర్శించినందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్‌సి) నాయకుడు, జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రశంసించారు. ఇది జాతీయ ఐక్యతను ప్రోత్సహించడమే కాకుండా దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహించే స్ఫూర్తిదాయకమైన గుర్తుగా ఆయన అభివర్ణించారు.

PM Modi: జమ్మూకాశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్ధుల్లా గుజరాత్‌ సందర్శన.. ప్రధాని మోదీ ప్రశంసలు!
Modi Tweet

Updated on: Aug 01, 2025 | 7:41 AM

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రొమెనేడ్‌ వెంబడి మార్నింగ్‌ వాక్‌కు వెళ్లి అందాలను ఆస్వాదించడం గురించి గతంలో ఒమర్ అబ్ధుల్లా చేసిన ట్వీట్‌కు స్పందిస్తూ ప్రధానమంత్రి మోదీ తన Xలో ఇలా పోస్ట్ చేశారు. “కాశ్మీర్ నుండి కెవాడియా వరకు! ఒమర్ అబ్దుల్లా జీ సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద తన పరుగును ఆస్వాదించడం, ఐక్యతా విగ్రహాన్ని సందర్శించడం ఆనందంగా అనిపించిందని ఆయన అన్నారు. ఆయన SoU( Statue of Unity) సందర్శన ఐక్యత గురించి ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడమేకాకుండా తోటి భారతీయుల్లో ప్రయాణస్ఫూర్తిని పెంపొందిస్తోందని ఆయన పేర్కొన్నారు.

గతంలో గుజరాత్‌లో పర్యటించిన జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్ అబ్దుల్లా తాను సబర్మతి రివర్ ఫ్రంట్ వద్ద మార్నింగ్‌, రన్నింగ్‌ చేసిన దృశ్యాలను తన X ఖాతాలో పోస్ట్ చేశారు. తాను పర్యాటక కార్యక్రమం కోసం అహ్మదాబాద్‌ వచ్చినప్పుడు ప్రఖ్యాత సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రొమెనేడ్‌లో చేసిన మార్నింగ్ వాక్, రన్నింగ్ తనకు ఎంతో ఆహ్లాదకరంగా అనిపించినట్టు ఆయన తెలిపారు. తాను పరుగెత్తగలిగిన అత్యంత అందమైన ప్రదేశాలలో ఇది కూడా ఒకటిగా నిలిచిపోతుందని.. చాలా మంది ఇతర వాకర్స్ రన్నర్లతో దీన్ని పంచుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. తాను అద్భుతమైన అటల్ ఫుట్ బ్రిడ్జిపై కూడా రన్నింగ్‌ చేసి అహ్మదాబాద్‌ అందాలను వీక్షించినట్టు ఆయన తెలిపారు.

ఐక్యతా విగ్రహం పట్ల కూడా ఒమర్‌ అబ్దుల్లా ప్రవంసలు కురిపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు ఇది నిజమైన నివాళిగా ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఇది నవ భారతదేశానికి చిహ్నంగా అభివర్ణించారు. ఐక్యతా విగ్రహం ఇంత అద్భుతంగా ఉంటుందని తాను ఊహించలేదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన సబర్మతి ప్రాజెక్టుపై ప్రసంశలు కురిపించారు. కరువు పీడిత ప్రాంతాలకు నీటిని తీసుకువచ్చినందుకు ఈ ప్రాజెక్టును ఆయన ప్రశంసించారు. కరువు తప్ప మరొకటి తెలియని ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్‌ నీటిని తీసుకొచ్చి ప్రాణాలు పోసిందని ఆయన అన్నారు. నీటిని ఆపే అనుమతి తమకు లేకపోవడంతో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టే అదృష్టం తమకు రాష్ట్రానికి లేకుండా పోయిందని ఆయన అన్నారు. సింధూ జలాల ఒప్పందం నిలిపివేతలో ఇప్పుడు అలాంటి ప్రాజెక్టులు తమ రాష్ట్రంలో కూడా నిర్మించుకొవచ్చని ఆయన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.