Drugs Seized: స్నేహితురాలితో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న మోడల్ అరెస్ట్.. కోటి విలువైన డ్రగ్స్ సీజ్

|

Jul 19, 2022 | 9:20 AM

డగ్ర్‌ తరలిస్తున్న సమయంలో శుభమ్, కీర్తిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా,మని తెలిపారు. శుభమ్, స్నేహితురాలు కీర్తి లు హిమాచల్‌ ప్రదేశ్ లో గంజాయిని కొనుగోలు చేసి.. కారులో గంజాయిని ఢిల్లీకి స్మగ్లింగ్ చేసేవారని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

Drugs Seized: స్నేహితురాలితో కలిసి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తోన్న మోడల్ అరెస్ట్.. కోటి విలువైన డ్రగ్స్ సీజ్
Follow us on

Drugs Seized: దేశంలో ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా.. అధికారులు ఎంత అప్రమత్తంగా ఉన్నా డ్రగ్స్ దందా నిరంతరం కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో భారీగా డ్రగ్స్ ను పట్టుకున్నారు. కోటి రూపాయల విలువైన డ్రగ్స్‌తో ఓ మోడల్‌తో పాటు అతని స్నేహితురాలిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లో డ్రగ్స్ సరఫరా చేసేవారని పోలీసులు తెలిపారు.

శుభమ్ మల్హోత్రా (25), శుభమ్ ఫ్రెండ్ కీర్తి (27) హిమాచల్ ప్రదేశ్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఢిల్లీలో విక్రయించేవారని చెప్పారు. ఢిల్లీ యూనివర్శిటీకి కొంతమంది డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు  ఢిల్లీ పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించార” అని క్రైమ్ బ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రోహిత్ మీనా తెలిపారు. డగ్ర్‌ తరలిస్తున్న సమయంలో శుభమ్, కీర్తిలను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నా,మని తెలిపారు. శుభమ్, స్నేహితురాలు కీర్తి లు హిమాచల్‌ ప్రదేశ్ లో గంజాయిని కొనుగోలు చేసి.. కారులో గంజాయిని ఢిల్లీకి స్మగ్లింగ్ చేసేవారని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.

కారుని భద్రతాదళాలు తనిఖీలు చేస్తున్న సమయంలో తప్పించుకోవడానికి ఇరువు సినీ ఫక్కీలో నాటకం ఆడేవారని..  కీర్తి గర్భవతిగా నటిస్తుందని.. అందుకోసం ఒక దిండుని ఉపయోగించేదని చెప్పారు. శుభమ్ హిమాచల్‌లో ఉన్నట్లు క్రైం బ్రాంచ్‌కు జూలై 12న సమాచారం అందింది. దీంతో  వీరిద్దరిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా స్కెచ్ వేసి.. హిమాచల్ ప్రదేశ్ నుంచి ఢిల్లీ తిరిగి వస్తుండగా.. ఢిల్లీ సింధు సరిహద్దు వద్ద ఉచ్చు బిగించారు. భారీ వర్షాల మధ్య వెంబడించి..  ఢిల్లీలోని గుప్తాచౌక్ వద్ద నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. ఇద్దరినీ అరెస్ట్ చేసి.. దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..