Patiala: పటియాలాలో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. భద్రత కట్టుదిట్టం

|

Apr 30, 2022 | 3:01 PM

పంజాబ్‌ పటియాలా(Patiala)లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్(Internet) సర్వీసులు, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేశారు. ఈ మేరకు...

Patiala: పటియాలాలో ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవల నిలిపివేత.. భద్రత కట్టుదిట్టం
Patiala Clashes
Follow us on

పంజాబ్‌ పటియాలా(Patiala)లో ఉద్రిక్తత కొనసాగుతోంది. శాంతిభద్రతలకు భంగం వాటిల్లే పరిస్థితులు ఉండటంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా మొబైల్ ఇంటర్నెట్(Internet) సర్వీసులు, ఎస్ఎంఎస్ సర్వీసులను నిలిపివేశారు. ఈ మేరకు పంజాబ్‌ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిన్న జరిగిన ఘర్షణల నేపథ్యంలో ముగ్గురు పోలీస్‌ అధికారులపై సీఎం భగవంత్‌మాన్‌ బదిలీ వేటు వేశారు. పటియాలా రేంజ్‌ ఐజీపీ, పటియాలా సీనియర్‌ ఎస్పీ, ఎస్పీలను బదిలీ చేశారు. వీరి స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ప్రజలు తప్పుడు వార్తలను నమ్మవద్దని, శాంతియుతంగా ఉండాలని పోలీసులు కోరారు. కాళీ మందిర్‌(Kalee Mandir) వద్ద భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు.. పటియాల జిల్లా బంద్‌కు హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఖలిస్థానీ మద్దతుదారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశాయి. జిల్లా వ్యాప్తంగా భద్రతను కట్టు దిట్టం చేశారు. పటియాలాలో ఇరువర్గాల ఘర్షణల్లో నలుగురికి గాయాలయ్యాయి. ఇరువర్గాలను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారు. కాల్పులు జరిపారు. అయితే అల్లరిమూకలు పోలీసుల పైకి రాళ్లు రువ్వాయి. రాళ్ల దాడిలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.

ఖలిస్తాన్‌ వేర్పాటు వాదానికి వ్యతిరేకంగా శివసేన కార్యకర్తలు ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అయితే దీనిపై ఖలిస్తాన్‌ అనుకూల వర్గాలు భగ్గమన్నాయి. ర్యాలీపై దాడి చేసేందుకు ప్రయత్నించాయి. పటియాలాలో శివసేన ఖలిస్తాన్‌ వ్యతిరేక మార్చ్‌ నిర్వహిస్తుండగా రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదం ఘర్షణకు దారి తీసింది. కాళి మాత ఆలయం సమీపానికి ర్యాలీ చేరుకోగానే ‘ఖలిస్తాన్‌ ముర్దాబాద్‌’ అంటూ శివసేన సైనికులు నినాదాలు చేపట్టారు. దీంతో సిక్కు సంఘాలకు చెందిన కత్తులు పట్టుకుని వీధుల్లోకి వచ్చారు. అనంతరం ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రంగంలోకి దిగిన పోలీసులు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. గ్రూపులు గొడవను పెద్దది చేసుకోవడంతో పోలీసులు గాల్లోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ స్పందించారు. ఇలా జరగడం దురదృష్టకరమని అన్నారు. దీనిపై డిజిపితో మాట్లాడానని, ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరించామన్నారు. అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, రాష్ట్రంలో విఘాతం సృష్టించాలనుకుంటే చూస్తూ ఊరుకోబోమని అన్నారు. పంజాబ్‌లో శాంతి, సామరస్యం చాలా ముఖ్యమని స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

ఇవీ చదవండి

Radhe Shyam: మరోసారి ఓటీటీలోకి వచ్చేస్తున్న రాధేశ్యామ్.. కానీ ఈసారి అలా..

Shahid Kapoor: కూల్ అండ్ స్టైలిష్ లుక్ లో షాహిద్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ పిక్స్