MMDR: మైనింగ్‌ రంగంలో అనేక సంస్కరణలు.. 55 లక్షల మందికి ఉపాధి కల్పన: బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి

|

Apr 03, 2021 | 9:53 AM

MMDR: గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ (ఎంఎండీఆర్‌) బిల్లు -2021ను పార్లమెంట్‌ ఉభయ సభలు గత నెలలో ఆమోదించాయి. అయితే పార్లమెంట్‌ బిల్లులపై

MMDR: మైనింగ్‌ రంగంలో అనేక సంస్కరణలు.. 55 లక్షల మందికి ఉపాధి కల్పన: బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి
Pinister Pralhad Joshi
Follow us on

MMDR: గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ (ఎంఎండీఆర్‌) బిల్లు -2021ను పార్లమెంట్‌ ఉభయ సభలు గత నెలలో ఆమోదించాయి. అయితే పార్లమెంట్‌ బిల్లులపై చర్చ సందర్భంగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి మాట్లాడుతూ.. దేశంలో మైనింగ్ రంగాన్ని మెరుగు పర్చడానికి దీనిని తీసుకువచ్చినట్లు చెప్పారు. ఈ బిల్లు చారిత్రాత్మకమైనదిగా ఆయన పేర్కొన్నారు. అలాగే ఖనిజ ఉత్పత్తిని పెంచుతుందని, మైనింగ్‌ రంగంలో సంస్కరణలు 55 లక్షల మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పిస్తామన్నారు. మైనింగ్‌ కార్యకలాపాలను పెంచడానికి, ఖనిజ అన్వేషనలో మెరుగైన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రైవేటు రంగాన్ని అనుమతిస్తామని మంత్రి వెల్లడించారు.

అలాగే ఖనిజాలు, బొగ్గు గనుల హక్కుల కోసం వేలం ప్రక్రియను పునరుద్దరించడాన్ని క్రమబద్దీకరించడానికి సంబంధించిన గనుల, ఖనిజాల (అభివృద్ధి, నియంత్రణ) సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. అయితే గనుల, ఖనిజాల చట్టంలోని సవరణలు ఉపాధి అవకాశాలను కల్పించడంలో సహాయపడతాయని మంత్రి వివరించారు. భారతదేశంలో 95 ఖనిజాలను ఉత్పత్తి చేస్తుందని, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి దేశాల సామర్థ్యాలను కలిగి ఉంటుందన్నారు. ఎంఎండీఆర్‌ చట్టంతో మైనింగ్‌ రంగంలో పారదర్శకత తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. ఉత్పత్తి పెరగడం బొగ్గు దిగుమతులను తగ్గి, భారత్‌లో ఇంధన రంగంలో స్వాలంబన పొందే దిశగా పయనిస్తోందని అన్నారు.

గనులు, ఖనిజాల అభివృద్ధి, నియంత్రణ సవరణ చట్టానికి సవరణలు తీసుకువచ్చిన ఫలితంగా దేశంలోని మైనింగ్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు అవకాశం ఏర్పడుతుంది. కొత్తగా సవరించిన చట్టం ద్వారా మైనింగ్‌ రంగంలో లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చు. అంతేకాదు, గనుల వేలం ప్రక్రియలో పోటీ పెంచడమే కాకుండా ప్రక్రియ కూడా వేగంగా జరిగే వీలుంటుంది. ప్రభుత్వం సంస్థల లీజు వ్యవధిని నిర్ణయించడానికి ఈ చట్టం కేంద్ర ప్రభుత్వానికి అధికారాన్నిస్తుంది. ఇప్పటి వరకూ గనుల వేలంకు సంబంధించి అంచెలంచల ప్రభుత్వ ప్రక్రియల కారణంగా చాలాసార్లు పనులు నిలిచిపోయేవి అయితే, ఇలాంటి సమస్యలను పరిష్కారం కోసం కేంద్రం కొత్త చట్టంలో చర్యలు తీసుకుంది.

ఇవీ చదవండి: Tamilnadu Elections 2021: నా పేరు ఎంకే. స్టాలిన్.. కరుణానిధి కుమారుడిని.. ఐటీ రైడ్స్‌పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన డీఎంకే చీఫ్

JD Lakshminarayana : 2019 ఎన్నికలలో రూ. 3,451 కోట్ల రూపాయలు పట్టుబడింది.. ఇంతకీ ఆ సొమ్మంతా ఏమైంది : మాజీ జేడీ