Rohini Sindhuri: ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై పరువు నష్టం దావా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..

|

Jun 24, 2021 | 9:48 PM

కర్ణాటక కేడర్ తెలుగు ఐఏఎస్ అధికారిణి, ముక్కుసూటిగా వ్యవహరించే ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరిపై వంద రూపాయల పరువు నష్టం దావా వేశారు ఎమ్మెల్యే...

Rohini Sindhuri: ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరిపై పరువు నష్టం దావా.. ఎంతో తెలిస్తే షాక్ అవుతారు..
Rohini Sindhuri Ias
Follow us on

ఇద్దరు రాజకీయ నేతల మధ్య వివాదం రచ్చ రచ్చగా మారుతోంది. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రాం కాదండోయ్.. మన పక్కనే ఉన్న కర్నాటక రాష్ట్రంలో జరుగుతున్న ఫైట్. అయితే ఇందులో ఐఏఎస్ అధికారి మాత్రం మన తెలుగు ఐఏఎస్ అధికారిణి. ముక్కుసూటిగా వ్యవహరించే ఐఏఎస్ ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్న రోహిణి సింధూరి. ఈ ఇద్దరి మధ్య గత కొద్ది రోజులుగా విమర్శలు.. ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.

దేవాదాయ శాఖకు బదిలీ అయిన మైసూరు జిల్లా కలెక్టర్ గా వ్యవహరించిన తెలుగు రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారిణి రోహిణి సింధూరి పై అదే జిల్లాకు చెందిన జేడీఎస్ పార్టీ మాజీ మంత్రి, తాజా ఎమ్మెల్యే సారా మహేష్ వంద రూపాయల పరువు నష్టం దావా వేయటం కర్ణాటక రాష్ట్రంలో చర్చనీయాంశం అయ్యింది.  మైసూరు జిల్లాధికారిగా వ్యవహరించిన రోహిణి సింధూరిపై అదే జిల్లాకు చెందిన  JDS పార్టీ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే సారా మహేశ్‌ రూ.100లకు పరువునష్టం కేసు వేశారు.

మైసూరు అధికారిగా  రోహిణి సింధూరి పని చేసిన ఏడెనిమిది నెలల పాటు ఇరువురి మధ్య పలు అంశాలపై వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సమస్య చిలికి చిలికి గాలివానగా మారింది. వీరి వివాదం కాస్త కోర్టు మెట్లు ఎక్కింది. చామరాజనగర్‌ జిల్లా ఆసుపత్రిలో కరోనా బాధితులు ఆక్సిజన్‌ అందక 20మంది మృతి చెందిన సంగతి సంగతి తెలిసిందే… ఈ ఘటనకు రోహిణి సింధూరి కారకురాలని సారా మహేశ్‌ అప్పట్లో ఆరోపించారు.

చామరాజనగర్‌కు మైసూరు నుంచే ఆక్సిజన్‌ చేరవేయాల్సి ఉండగా జాప్యం చేశారని మహేశ్ మండిపడ్డడారు. వివాదంపై హైకోర్టు నియమించిన ఇరువురు రిటైర్డ్‌ న్యాయమూర్తుల విచారణలలో మైసూరు జిల్లాధికారి రోహిణి సింధూరికి సంబంధం లేదని తేల్చారు. ఇందుకు జిల్లా ప్రజలకు అధికా రులకు సారా మహేష్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఆ తర్వాత సారామహేష్‌కు చెందిన  మ్యారేజ్ ఫంక్షన్ హాల్ రాజకాలువపై ఉందని జిల్లాధికారి ఒకరు ఆరోపించారు. రెవెన్యూశాఖ పరిశీలనలలో అక్రమాలు చోటు చేసుకోలేదని తేలింది. దీనికి తోడు పదేళ్ళుగా సారా మహేశ్‌తో పాటు ఆయన భార్యకు చెందిన ఆస్తులను విచారించాలని రోహిణి సింధూరి మైసూరు అభివృద్ధి ప్రాధికారకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ రచ్చ మరింత కాక రేపుతోంది.

ఇవి కూడా చదవండి : రాత్రిళ్లు కల్లోకి వచ్చి అత్యాచారం చేస్తున్నాడు..! బిహార్‌ పోలీసుల ముందుకు విచిత్రమైన కేసు..!

సీఎం వ్యక్తిగత భద్రతా అధికారి చెంప పగలగొట్టిన లోకల్ ఎస్పీ..