MLA Buying Case: సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే ల కొనుగోలు కేసు.. సిట్ విచారణ ఆపేయాలని ఆదేశాలు.. కోర్టుకు రానివారికి నోటీసులు..

సిట్ దర్యాప్తు సాగించాలని పిటిషన్ కోరారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తు కూడా నిలుపుదల చేయాలన్న ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు ఆగిపోయి

MLA Buying Case: సుప్రీం కోర్టులో ఎమ్మెల్యే ల కొనుగోలు  కేసు.. సిట్ విచారణ ఆపేయాలని ఆదేశాలు.. కోర్టుకు రానివారికి నోటీసులు..
Mla Buying Case

Updated on: Mar 17, 2023 | 1:23 PM

ఎమ్మెల్యే ల కొనుగోలు కేసులో తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ పై సుప్రీంకోర్టు లో విచారణ జరిగింది. సిబిఐ దర్యాప్తు ను నిలిపివేసి, సిట్ దర్యాప్తు సాగించాలని పిటిషన్ కోరారు. తెలంగాణ పోలీసుల దర్యాప్తు కూడా నిలుపుదల చేయాలన్న ధర్మాసనం ఆదేశించింది. తెలంగాణ పోలీసుల దర్యాప్తు ఆగిపోయి చాలా రోజులైందని కోర్టుకు తెలిపారు తెలంగాణ ప్రభుత్వ తరఫు న్యాయవాది. ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసును సుప్రీంకోర్టులో ప్రస్తావించింది తెలంగాణ ప్రభుత్వం. గత విచారణ సందర్భంగా సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ ఇచ్చిన ఆదేశాలపై నోటీసులు ఇవ్వలేదని తెలిపింది ప్రభుత్వం. తెలంగాణ పోలీసుల దర్యాప్తు సైతం నిలిపివేయాలని స్పష్టం చేసింది ధర్మాసనం. హైకోర్టులో కేంద్రం, సీబీఐ తరఫున ఎవరూ హాజరుకాలేదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం మినహా మిగతా ప్రతివాదుల (సీబీఐ)కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది ధర్మాసనం.

హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిపిందే. ఈ కేసులో ప్రధాన నిందితులు బీజేపీకి చెందిన వారని.., కేంద్ర దర్యాప్తు సంస్థకు కేసును అప్పగిస్తే నీరుగారిపోయే ప్రమాదం ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే గత నెలలో వాదనలు వినిపించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం