Mizoram CM: మా మంత్రులకు హిందీ, ఇంగ్లీషు రాదు.. మా భాష తెaలిసిన సీఎస్ ఉంటే బెటర్.. కేంద్రానికి మిజోరం సీఎం లేఖ

|

Nov 09, 2021 | 4:07 PM

మిజోరాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం వివాదస్పదంగా మారింది. కొత్త సీఎస్‌గా రేణు శర్మ అపాయింట్ ‌చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యూ జొరంతంగ అభ్యంతరం వ్యక్తం చేశారు.

Mizoram CM: మా మంత్రులకు హిందీ, ఇంగ్లీషు రాదు.. మా భాష తెaలిసిన సీఎస్ ఉంటే బెటర్.. కేంద్రానికి మిజోరం సీఎం లేఖ
Pu Zoramthanga Has Written A Letter To Amit Shah
Follow us on

Mizoram CM Letter: మిజోరాం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం వివాదస్పదంగా మారింది. కొత్త సీఎస్‌గా రేణు శర్మ అపాయింట్ ‌చేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్యూ జొరంతంగ అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కేబినెట్ మంత్రులకు హిందీ తెలియదని, ఇంగ్లిష్ కూడా అర్థం చేసుకోలేరని, అందుకే మిజో భాష తెలిసిన వారికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే మించిదన్నారు. ప్రస్తుత అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లాల్‌నున్మవియా చువావుగో పదవీ విరమణ చేసిన తర్వాత, ప్రస్తుత అడిషినల్ చీఫ్ సెక్రటరీ జేసీ రంతంగను ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాలని కోరానని ముఖ్యమంత్రి ప్యూ జొరంతంగ తెలిపారు. ఈ మేరక కేంద్ర ప్రభుత్వ అనుమతి కోరుతూ.. ఓ లేఖను అమిత్ షాకు రాశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రేణు శర్మను నూతన ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.తన కేబినెట్‌ మంత్రులకు హిందీ భాష తెలియదని, ఇంగ్లిష్‌ను అర్థం చేసుకోలేరని సీఎం పేర్కొన్నారు. మాతృ భాష తెలిసిన వారిని నియమిస్తే మంచిదన్నారు. మిజో భాష తెలియని వ్యక్తిని సీఎస్‌గా నియమిస్తే.. సమర్థవంతంగా, ప్రభావంతంగా పనిచేయలేరన్నారు. మిజోరం రాష్ట్ర ఏర్పాటు అయిన దగ్గర నుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతుందని, అందుకే మిజో భాష తెలిసిన వారిని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించాలని ఆయన లేఖలో కోరారు.

ఈ లేఖను అక్టోబరు 29న పంపించినట్లు ముఖ్యమంత్రి సలహాదారు ప్యూ సీ లాల్రంజవువా తెలిపారు. రేణు శర్మకు కేంద్ర ప్రభుత్వం అక్టోబరు 28న ఆదేశాలు ఇచ్చింది. నవంబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించాలని ఆదేశించింది. కానీ అదే రోజు మిజోరాం ప్రభుత్వం కూడా ఓ ఆర్డర్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నవంబరు 1 నుంచి బాధ్యతలను నిర్వహించాలని జేసీ రంతంగను ఆదేశించింది. దీంతో ముఖ్యమంత్రి ప్యూ జొరంతంగ అభ్యంతరం తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్డీయే విశ్వాస భాగస్వాముల్లో తాను కూడా ఒకరినని, అందువల్ల తన అభ్యర్థనను మన్నించి, సానుకూల నిర్ణయం తీసుకుంటుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి ఈ లేఖను అమిత్ షాకు గత 29న రాయగా, తాజాగా వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సీఎం రాసిన లేఖపై కేంద్రం ఎలాంటి స్పందన తెలియజేయలేదు.

Read Also…  Covid Vaccine: బ్రిటన్‌కు వెళ్లే భారత ప్రయాణికులకు శుభవార్త.. కోవాగ్జిన్ తీసుకున్నవారికి అనుమతి.. ఎప్పటి నుంచి అంటే?