బావిలో దొరికిన మృతదేహానికి అంత్యక్రియలు.. కట్‌చేస్తే.. 3 రోజుల తర్వాత ఊహించని ట్విస్ట్..

గ్రామం సమీపంలోని బావిలో దొరికిన ఒక మృతదేహాన్ని తప్పిపోయిన తమ కొడుకుది భావించిన ఒక కుటుంబ ఆ మృతదేహాన్ని అంత్యక్రియలు నిర్వహించారు. ఇక మూడో రోజు దహన సంస్కారాల స్థలంలో బూడిదను సేకరిస్తుండగా, అకస్మాత్తుగా చిపోయాడనుకున్న వాళ్ల కుమారుడు దర్శనమిచ్చాడు. అతన్ని చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ ఆశ్చర్యకరమైన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని సూరజ్‌పూర్ జిల్లాలో వెలుగు చూసింది.

బావిలో దొరికిన మృతదేహానికి అంత్యక్రియలు.. కట్‌చేస్తే.. 3 రోజుల తర్వాత ఊహించని ట్విస్ట్..
Man Returns Alive Funeral

Updated on: Nov 06, 2025 | 5:15 PM

తప్పిపోయిన కుమారుడు చనిపోయాడని అంత్యక్రియలు చేసిన ఒక కుటుంబానికి మూడు రోజుల తర్వాత ఊహించని షాక్ తగిలింది. సరిగ్గా మూడో రోజు దహన సంస్కారాలు చేసిన స్థలంలో బూడిదను సేకరిస్తుండగా అకస్మాత్తుగా వారి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ సంఘటన చంద్రపూర్ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. పురుషోత్తం అనే యువకుడు స్థానికంగా తన కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. అయితే మూడు రోజులుగా పురుషోత్తం కనిపించకపోవడంతో.. అతని కుటుంబ సభ్యులు అతని కోసం విస్తృతంగా వెతికారు, కానీ అతని జాడ దొరకలేదు. దీంతో వారు స్థానక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కంప్లైంట్ ఇచ్చారు.

ఇదిలా ఉండగా నవంబర్ 1న గ్రామ సమీపంలోని ఒక బావిలో గుర్తు తెలియని మృతదేహాన్నిగ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాం బాగా కుళ్లిపోయి గుర్తపట్టలేని స్థితిలో ఉండడంతో అది తప్పిపోయిన పురుషోత్తం మృతదేహం అని పోలీసులు అనుమానించారు. దీంతో మృతదేహాన్ని గుర్తించడానికి పోలీసులు అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతదేహంపై లభించిన దుస్తుల ఆధారంగా, కుటుంబ సభ్యులు అది పురుషోత్తం మృతదేహమేనని గుర్తించారు. పోస్ట్‌మార్టం తర్వాత, మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు పోలీసులు. దీంతో కుటుంబ సభ్యులు అ మృతదేహాన్ని అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రాణాలతో తిరిగి వచ్చిన కొడుకు

ఇక అంత్యక్రియలు జరిగిన మూడో రోజులు అసలు ట్విస్ట్ వెలుగు చూసింది. కుటుంబం బూడిదను సేకరించడానికి దహన సంస్కారాల స్థలం వద్దకు వెళ్తుండగా పురుషోత్తం సజీవంగా వారికి అడొచ్చాడు. అతన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. దీంతో గ్రామం మొత్తం తీవ్ర గందరగోళానికి గురైంది. ఇంతకు అతని మనిషేనా అని అందరూ ఆశ్చర్యపోయారు. చివరకు పురుషోత్తం మూడు రోజులుగా అంబికాపూర్‌లోని తన బంధువుల ఇంట్లో ఉన్నానని, తన గ్రామంలో ఇంత ముఖ్యమైన సంఘటన జరిగిందని తనకు తెలియదని చెప్పడంతో అందరూ ఊరిపి పీల్చుకున్నారు.

ఆ దేవుడే నా కొడుకును తిరిగి పంపాడు

ఇదిలా ఉండగా చనిపోయాడనుకున్న కొడుకు తిరిగి రావడంతో ఆ కుటుంబ సంతోషానికి అవదులు లేకుండా పోయాయి. పురుషోత్తం తల్లి మన్‌కున్వర్ మాట్లాడుతూ, “దొరికిన మృతదేహం నా కొడుకుది కాదని మాకు తెలియదు. నా కొడుకు సజీవంగా తిరిగి వచ్చినప్పుడు, దేవుడు అతన్ని తిరిగి ఇచ్చినట్లు నాకు అనిపించింది” అని అన్నారు.

మరి బావిలో దొరికిన మృతదేహం ఎవరిది

బావిలో దొరికిన మృతదేహం పురుషోత్తంది కాదు.. మరి పురుషోత్తం కుటుంబ సభ్యులు దహనం చేసిన మృతదేహం ఎవరిదీ అనే అయోమయంలో పోలీసులు పడిపోయారు. ఈ ఘటనపై చంద్రపూర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ విమలేష్ దూబే మాట్లాడుతూ, “పురుషోత్తం కుటుంబం అతని దుస్తుల ఆధారంగా మృతదేహాన్ని గుర్తించింది. ఇప్పుడు అతను సజీవంగా తిరిగి వచ్చాడు, బావిలో ఎవరి మృతదేహం దొరికిందో తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము” అని అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.