రేపటినుంచి తెరుచుకోనున్న స్కూల్స్

| Edited By:

Aug 20, 2019 | 1:07 AM

బుధవారం నుంచి కాశ్మీర్‌ లోయలో పాఠశాలలు తెరుచుకోనున్నాయని జమ్ము కశ్మీర్ అధికారులు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఈ తరుణంలో స్కూల్స్ రీ ఓపెన్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. పోలీస్, ఇన్ఫర్మేషన్, విద్యాశాఖాధికారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. కశ్మీర్ లోయ ప్రాంతంలో సోమవారం పలు చోట్ల పాఠశాలలు తెరిచారని, మిగిలిన ప్రాంతాల్లో కూడా బుధవారం నుంచి విద్యార్ధులు స్కూల్స్‌కు […]

రేపటినుంచి తెరుచుకోనున్న స్కూల్స్
Follow us on

బుధవారం నుంచి కాశ్మీర్‌ లోయలో పాఠశాలలు తెరుచుకోనున్నాయని జమ్ము కశ్మీర్ అధికారులు వెల్లడించారు. ఆర్టికల్ 370 రద్దుతో ఏర్పడ్డ పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడిప్పుడే అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఈ తరుణంలో స్కూల్స్ రీ ఓపెన్ చేయనున్నట్టు అధికారులు తెలిపారు. పోలీస్, ఇన్ఫర్మేషన్, విద్యాశాఖాధికారులు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సమావేశం అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. కశ్మీర్ లోయ ప్రాంతంలో సోమవారం పలు చోట్ల పాఠశాలలు తెరిచారని, మిగిలిన ప్రాంతాల్లో కూడా బుధవారం నుంచి విద్యార్ధులు స్కూల్స్‌కు వెళ్లవచ్చని తెలిపారు. కశ్మీర్ లోయ ప్రాంతంలో ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ కొనసాగుతుందని, అల్లర్లపై వస్తున్న పుకార్లను ప్రజలెవరూ నమ్మవద్దంటూ ప్రజలకు విఙ్ఞప్తి చేశారు అధికారులు.