కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర డిసెంబర్ 24న ఢిల్లీలో ప్రవేశించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం కల్పించాలనే సంకల్పంతో సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర దాదాపు 3,000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో యాత్రకు కొన్ని రోజుల పాటు విరామం పలికి, తిరిగి 2023 జనవరిలో ప్రారంభించాలని రాహుల్ నిర్ణయించారు. జోడో యాత్ర ఢిల్లీ చేరిన మరుసటి రోజే(ఆదివారం) దేశ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ జయంతి కావడంతో రాహుల్ గాంధీ ఆయనకు నివాళులర్పించారు. ఆ క్రమంలోనే సోమవారం మహాత్మా గాంధీ తదితర ప్రముఖులకు, మాజీ ప్రధానులకు రాహుల్ గాంధీ నివాళులర్పించారు.
అయితే నివాళులర్పిస్తున్న సమయంలో రాహుల్ గాంధీ టీ షర్ట్‌లో ఉన్నారు. 8-9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్న ఢిల్లీలో.. టీ షర్ట్ ధరించి నడుస్తున్న రాహుల్ గాంధీ ఫోటోలను కాంగ్రెస్ నేతలు పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో అవి వైరల్ అవుతున్నాయి. ఇక నెటిజన్లు తమ ఆశ్చర్యాన్ని వారి కామెంట్ల ద్వారా తెలియజేస్తున్నారు.
पूरे विश्व को प्रेम और अहिंसा की सीख दी है भारत की पवित्र भूमि ने। इन्ही आदर्शों को दिल में लिए, भारत मां के सपूतों के पदचिह्न देख, आगे बढ़ रहे हैं हम… pic.twitter.com/Dnei96W4G5
— Rahul Gandhi (@RahulGandhi) December 26, 2022
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ‘‘ఢిల్లీలో ఉదయం ఉష్ణోగ్రత 9 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది.. టీ షర్ట్‌లోనే నడుస్తున్నారా? ఇంతటి ఎనర్జీ ఎక్కడ నుంచి పొందుతారు రాహుల్ గాంధీ భయ్యా..’’ కామెంట్ చేశాడు.
In morning temperature of Delhi was 9 degree Celsius.
Only in T shirt ? Itni energy kahan se laate ho bhai . @RahulGandhi
— Robert Downey ?️ (@NoTime2Study) December 26, 2022
“ఈయనకు ఎందుకు చలి అనిపించడం లేదు? అందరూ కోటు, జాకెట్‌లో ఉన్నారు. కానీ ఈయన హాఫ్ టీ-షర్ట్‌లో కనిపిస్తున్నారు. ఈరోజు ఢిల్లీలో చలి వణికిస్తోంది. #RahulGandhi #BharatJodaYatra’’ అని జర్నలిస్ట్ అజిత్ అంజుమ్ హిందీలో ట్వీట్ చేశారు.
यार इस बंदे को ठंड क्यों नहीं लग रही है ?
सब कोट और जैकेट में है , ये बंदा हाफ़ टीशर्ट में दिख रहा है .
जबकि आज दिल्ली में कड़ाके की ठंड पड़ रही है .#RahulGandhi #BharatJodaYatra https://t.co/jUo5eK8Vea— Ajit Anjum (@ajitanjum) December 26, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.