‘ప్యాడ్ మన్’ సరే.. ‘ప్యాడ్ గర్ల్’ గురించి తెలుసా..!

| Edited By: Anil kumar poka

Oct 29, 2019 | 6:15 PM

‘ప్యాడ్ మన్’ గురించి మనందరికీ తెలిసిందే. తమిళనాడుకు చెందిన అరుణాచలం మురగనాథం అనే వ్యక్తి అమ్మాయిల పీరియడ్ ఇబ్బందులను గమనించి శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేయడంతో పాటు.. ఈ రంగంలో ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఈయన కథ ఆధారంగానే బాలీవుడ్‌లో ‘ప్యాడ్ మన్’ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్ నటించగా.. ఈ మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే ఆయన సరే.. మీకు ‘ప్యాడ్ గర్ల్’ గురించి తెలుసా..! కాటన్‌తో ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ […]

ప్యాడ్ మన్ సరే.. ప్యాడ్ గర్ల్ గురించి తెలుసా..!
Follow us on

‘ప్యాడ్ మన్’ గురించి మనందరికీ తెలిసిందే. తమిళనాడుకు చెందిన అరుణాచలం మురగనాథం అనే వ్యక్తి అమ్మాయిల పీరియడ్ ఇబ్బందులను గమనించి శానిటరీ ప్యాడ్స్‌ను తయారుచేయడంతో పాటు.. ఈ రంగంలో ఇప్పుడు ఎంతోమందికి ఉపాధిని కల్పిస్తున్నారు. ఈయన కథ ఆధారంగానే బాలీవుడ్‌లో ‘ప్యాడ్ మన్’ అనే సినిమా తెరకెక్కింది. ఇందులో అక్షయ్ కుమార్ నటించగా.. ఈ మూవీపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు. అయితే ఆయన సరే.. మీకు ‘ప్యాడ్ గర్ల్’ గురించి తెలుసా..! కాటన్‌తో ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన ఓ బాలిక ఇప్పుడు ప్యాడ్ గర్ల్‌గా పేరు ఘడించింది.

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఇషానా అనే 18ఏళ్ల బాలిక 2018లో తన స్కూలింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే ఆ తరువాత పెద్ద చదువులు చదవడం కంటే.. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ ఐడియా వచ్చింది. వెంటనే తల్లిదండ్రుల సహకారంతో కాటన్‌తో శానిటరీ ప్యాడ్స్‌ను చేయడం ప్రారంభించింది. వాటిని మొదట తాను వాడి.. ఇబ్బందులేవీ లేవని నిర్ధారించుకున్న తరువాతే తక్కువ ధరకు అమ్మడం ప్రారంభించింది. ఇక క్రమంగా ఆ ప్యాడ్స్‌కు మంచి డిమాండ్ రావడంతో.. ఇప్పుడు మరికొందరికి ఉపాధిని కల్పిస్తోంది.

దీని గురించి ఇషాన్ మాట్లాడుతూ.. ‘‘ఎకో ఫ్రెండ్లీ శానిటరీ ప్యాడ్స్ చేయడంలో నాకు పెద్దగా పట్టు లేనప్పటికీ.. స్కూల్ నుంచే ఫ్యాషన్ డిజైన్‌పై నాకు ఆసక్తి ఉండేది. పర్యావరణానికి శానిటరీ ప్యాడ్స్ కూడా నష్టాన్ని కలిగిస్తుండగా.. దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నా. నా కోసం ఎకో ఫ్రెండ్లీ కాటన్ శానిటరీ ప్యాడ్‌ను మొదట తయారుచేసుకున్నా. ఆ తరువాత దానితో ఇబ్బందులేవీ లేవని నిర్ధారించుకున్న తరువాత.. ఎక్కువగా తయారు చేయడం ప్రారంభించా’’ అని తెలిపింది. గణపతి అనే గ్రామంలో ఇషాన్ అనా క్రియేషన్స్ పేరుతో ఎకో ఫ్రెండ్లీ ప్యాడ్స్ షాప్‌ను ఆమె నడుపుతోంది.

ఇక మొదట చదువు మానేస్తానని తాను చెప్పగానే తల్లిదండ్రులు వ్యతిరేకించారని.. కానీ ఆ తరువాత వ్యాపారంపై తన ఆలోచనను చెప్పగా.. వారి నుంచి మద్దతు లభించిందని తెలిపింది. ఇక ఆమె తయారు చేసిన ప్యాడ్ ఖరీదు రూ.120లు కాగా.. దాన్ని తిరిగి వాడుకుంటూ ఉండొచ్చని(రీయూజబుల్) అని పేర్కొంది. అంతేకాకుండా ఈ ప్యాడ్స్ వలన పర్యావరణానికి, మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆమె పేర్కొంది. ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్న సమయంలో ఇషానా తండ్రి ఆమె వివాహం కోసం దాచి ఉంచిన రూ.4లక్షలను ఇచ్చినట్లు తెలిపింది.

ఇక ఇషానా దగ్గర పనిచేస్తోన్న వారిలో ఓ మహిళ మాట్లాడుతూ.. వీటిని కుట్టడం వలన ఇంట్లో ఉండి రోజుకు రూ.400 సంపాదిస్తున్నానని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ప్యాడ్స్ తన షోరూంలో మాత్రమే దొరుకుతుండగా.. త్వరలో ఈ-కామర్స్ దిగ్గజాలైన అమెజాన్, ఫ్లిప్‌కార్డులో లభించనున్నాయి.