Beauty queen Diksha Singh: అందరిచూపు ఆ వార్డుపైనే.. పంచాయతీ ఎన్నికల బరిలో మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌..

ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్‌మెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది.

Beauty queen Diksha Singh: అందరిచూపు ఆ వార్డుపైనే.. పంచాయతీ ఎన్నికల బరిలో మిస్‌ ఇండియా ఫైనలిస్ట్‌..
Model Diksha Singh To Contest In Up Panchayat Elections

Updated on: Apr 03, 2021 | 5:20 PM

Beauty Pageant Diksha Singh: ఉత్తరప్రదేశ్‌లో మరికొద్ది రోజుల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో జాన్‌పూర్ జిల్లా బక్షా డెవలప్‌మెంట్ బ్లాక్ పంచాయతీ పోరు ఆసక్తికరంగా మారింది. ఇప్పుడీ పంచాయతీలో పోటీ చేస్తున్న వ్యక్తుల విషయం హాట్ టాపిక్‌గా మారింది. అందరి చూపు అటు వైపు మళ్లాయి.

ఎందుకంటే ఇక్కడి 26వ వార్డు నుంచి మోడల్‌, అందాల రాణి దీక్షా సింగ్‌ బరిలోకి దిగుతున్నారు. 2015లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచిన దీక్షా సింగ్‌.. ప్రైవేటు ఆల్బమ్స్‌తో పాటు పలు ప్రకటనల్లో నటించారు. ఇదిలావుంటే, ఆమె తండ్రి కోరిక మేరకు ఆమె రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. దీక్ష తండ్రి జితేంద్ర సింగ్‌ రాజకీయాల్లో కొనసాగుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బక్షా డెవలప్‌మెంట్‌ బ్లాక్‌లోని 26వ వార్డు నుంచి పోటీ చేసేందుకు ఎన్నో రోజుల నుంచి ప్రిపేర్ అయ్యారు. అయితే, రిజర్వేషన్లలో భాగంగా ఈ వార్డును మహిళకు కేటాయించారు. దీంతో తండ్రి కోరిక మేరకు రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు.

యూపీలో ఏప్రిల్‌ 15 నుంచి నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జాన్‌పూర్‌ జిల్లాలో తొలి విడతలో భాగంగా ఏప్రిల్‌ 15న పోలింగ్‌ నిర్వహించనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆమె భారతీయ జనతా పార్టీ అభ్యర్థి షాలినీ సింగ్‌తో తలపడనున్నారు. దీక్ష స్వస్థలం బక్ష ప్రాంతంలోని చిట్టోరి గ్రామం. అయితే వ్యాపార రీత్యా గోవాలో స్థిరపడింది. ఆమె తండ్రి జితేంద్ర గోవా, రాజస్థాన్‌లో ట్రాన్స్‌పోర్టు బిజినెస్‌ నిర్వహిస్తున్నారు.


Read Also… మరోసారి గొప్ప మనసు చాటుకున్న ఆనంద్ మహీంద్రా.. ‘రూపాయికే ఇడ్లీ’ అందించిన బామ్మ కమలాత్తాళ్‌కు సొంతిల్లు