Covid Vaccine: దేశంలో మరికొన్ని వారాల్లో ప్రజలకు మూడు-నాలుగు రకాల కరోనా వైరస్ వ్యాక్సిన్లు అందుబాటులోకి రావచ్ఛు నని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా తెలిపారు. ప్రభుత్వం ఇనాక్యులేషన్ డ్రైవ్ ని విస్తరించనుందని, అందువల్ల ఏ టీకామందుల్లో ఏదో ఒకదాన్ని ప్రజలు ఎంచుకోవాల్సి ఉందన్నారు. సోమవారం నుంచి తమ వ్యాక్సిన్ సెంటర్లను ఎంపిక చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు. మూడు లేక నాలుగు వ్యాక్షన్లు ఒకే కేంద్రంలో అందుబాటులో ఉండబోవు.. ఒక టైప్ వ్యాక్సిన్ ఒక కేంద్రంలోనే ఉంటుంది అని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు తమ సమీప ప్రాంతాల్లోని వేర్వేరు ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకామందులను ఎంపిక చేసుకోవచ్చు అన్నారు. దీనివల్ల ఏ హాస్పిటల్ లో ఏ టైప్ వ్యాక్సిన్ ఉందొ తెలుసుకోగలుగుతారు అన్నారు.
ఒక కేంద్రానికి వెళ్లి ఫలానా వ్యాక్సిన్ కావాలనో, లేదా మరొకటి కావాలనో కోరజాలరని గులేరియా చెప్పారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున అత్యవసరంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కూడా పెరగాల్సి ఉందని అన్నారు. మ్మన దేశ జనాభా ఎక్కువని, అందువల్ల అందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే ప్రైవేటు రంగానికి కూడా ఈ వెసులుబాటు కల్పించాల్సి ఉంటుందన్నారు. ఎక్కువమందికి టీకామందు ఇస్తే కేసుల సంఖ్య తగ్గుతుంది. పైగా హాస్పిటలైజేషన్ అవసరం ఉండదు.. మరణాలసంఖ్యను కూడా తగ్గించగలుగుతాం అని గులేరియా వ్యాఖ్యానించారు. ప్రైవేటు హాస్పిటల్స్ లో వ్యాక్సిన్ ధరలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో డోసు 250 రూపాయలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. కాగా భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్ ని కేవలం 11 శాతం మంది మాత్రమే ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తోంది.. ఆగస్టు నాటికి 30 కోట్ల జనాభాకు టీకామందులు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఇక రష్యావారి స్పుత్నిక్ వీ, కాడిలా హెల్త్ కేర్ వారి ‘ జైనోవ్-డీ’ ని ప్రభుత్వం త్వరలో అత్యవసర వినియోగానికి అనుమతించాల్సి ఉంది. రేపటి నుంచి అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు ఆరోగ్య శాఖ పునరుద్ఘటించిందీ.
Read More:
Covid-19: దేశవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు.. నిన్న నమోదైన కేసులు ఎన్నంటే..?
IT Act 2021: 50 లక్షల యూజర్లు దాటితే ప్రధాన మీడియానే.. సంస్థలన్నీ సమాచారమివ్వాల్సిందే..