ఢిల్లీ శివార్ల లోని ఘజియాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జైపూరియా మాల్‌లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మాల్ లోని పై అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సంఘటనా స్థలానికి ఐదు ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో భారీ ఆస్తినష్టం జరిగింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. అయితే లాక్‌డౌన్ కారణంగా మాల్‌లో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
ఘజియాబాద్‌లో ఇందిరాపురం ప్రాంతంలోని ఓ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడుతుండటంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొస్తున్నాయి. మాల్‌కు సమీపంలో నివాస స్థలాలు ఉండటంతో ఆందోళన నెలకొంది. మంటలకు తోడు గాలి వీస్తుండటంతో అగ్ని కీలలు విస్తరిస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆస్తి నష్టం భారీగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అనుకుంటున్నారు. ముందుగా మంటలు షాపింగ్ మాల్‌లోని ఏసీ