Home Loan: సొంతిల్లు కొనుక్కోవాలను కుంటున్నారా? ఎస్బీఐ కంటే తక్కువ వడ్డీకి కోటక్ మహీంద్రా హోమ్ లోన్ ఇస్తోంది.. ట్రై చేయండి!
ఇల్లు కట్టుకోవాలను కుంటున్నారా? హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రముఖ ప్రయివేట్ బ్యాంకు కోటక్ మహీంద్రాను సంప్రదించండి.
Home loan: ఇల్లు కట్టుకోవాలను కుంటున్నారా? హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ప్రముఖ ప్రయివేట్ బ్యాంకు కోటక్ మహీంద్రాను సంప్రదించండి. ఎందుకంటే.. హోమ్ లోన్స్ పై ప్రత్యకమైన వడ్డీ రేటును కొనసాగిస్తున్న బ్యాంకు అది ఒక్కటే. ఇక్కడ ఎస్బీఐ కన్నా తక్కువ వడ్డీరేటుతో హోమ్ లోన్ పొందగలిగే ఛాన్స్ ఉంది. హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికీ ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. గత నెలలో ఎస్బీఐ, కోటక్ బ్యాంకు లు ప్రత్యేక వడ్డీ రేటుతో హోమ్ లోన్లు అందించాయి. ఇప్పుడు అదే వడ్డీ రేట్లను కోటక్ మహీంద్రా కొనసాగిస్తోంది. కానీ, ఎస్బీఐ ఆ అవకాశాన్ని ఆపేసింది.
కోటక్ మహీంద్రా బ్యాంకు లో హోమ్ లోన్ పై వడ్డీ రేటు ప్రస్తుతం 6. 65 శాతంగా ఉంది. అదే ఎస్బీఐ హోమ్ లోన్ పై 6.95 శాతంగా ఉంది. అయితే, గత నెలలో ఎస్బీఐ కూడా 6.65 శాతం వడ్డీరేటుపై హోమ్ లోన్లు అందించింది. ఇప్పుడు ఆ వడ్డీరేటును పెంచింది. ప్రత్యేకంగా అందించిన వడ్డీరేట్లను మార్చి 31 వరకే ఎస్బీఐ అందుబాటులో ఉంచింది. కానీ, కోటక్ బ్యాంకు మాత్రం ఈ రేట్లను అలాగే కొనసాగిస్తోంది.
బ్యాంకు నుంచి హోమ్ లోన్ తీసుకోవాలని భావించేవారికి ఇదే మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎందుకంటే హోమ్ లోన్స్‌పై వడ్డీ రేట్లు 15 ఏళ్ల కనిష్ట స్థాయిలో ఉన్నాయి. అందువల్ల మీరు హోమ్ లోన్ తీసుకోవాలని భావిస్తే.. ఇప్పుడే పొందటం మంచిదని ఆర్ధిక నిపుణులు సూచిస్తున్నారు. సో.. సొంతింటి కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మరి.
Also Read: Kinjarapu Atchannaidu: లోకేష్‌ను, నన్ను విడదీయలేరు… వైరల్ అవుతున్న వీడియోపై స్పందించిన అచ్చెన్నాయుడు
Viral Video: ఈ వీడియో చూస్తే నవ్వలేక మీ పొట్ట చెక్కలవుతుంది.. చివర్లో ట్విస్ట్ మాత్రం మిస్ అవ్వొద్దు