అసోంలో భారీ అగ్నిప్రమాదం.. భయం గుప్పిట్లో స్థానికులు..

| Edited By:

Jun 09, 2020 | 6:32 PM

అసోంలోని  తిన్సుకియా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సహజ వాయువును ఉత్పత్తి చేసే ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఓ చమురు బావిలో మంగళవారం మధ్యాహ్నం భారీ మంటలు చెలరేగాయి.

అసోంలో భారీ అగ్నిప్రమాదం.. భయం గుప్పిట్లో స్థానికులు..
Follow us on

అసోంలోని  తిన్సుకియా జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సహజ వాయువును ఉత్పత్తి చేసే ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఓ చమురు బావిలో మంగళవారం మధ్యాహ్నం భారీ మంటలు చెలరేగాయి. గత కొద్ది రోజులుగా ఇక్కడ గ్యాస్ లీక్‌ అవుతున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రభుత్వం సమీపంలో ఉన్న ప్రజలను దూరం ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసింది.

మే 27వ తేదీ నుంచి ఇక్కడ గ్యాస్ లీక్‌ అవుతోంది. అయితే దీనిని కట్టడి చేసేందుకు సింగపూర్‌ నుంచి ప్రత్యేక నిపుణులు కూడా సోమవారం నాడే ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాదు గ్యాస్ లీక్‌ కాకుండా అరికట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇదిలా ఉండగానే మంగళవారం నాడు మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగ వ్యాపించడంతో.. సమీపం ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కప్పేయబడ్డాయి. పరిసర ప్రాంతాలకు కూడా మంటలు వ్యాపించే అవకాశం ఉండటంతో.. ముందస్తు జాగ్రత్తగా పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లను ఏర్పాటు చేశారు. గత కొద్ది రోజుల నుంచి ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా ఇదే ప్రాంతంలో ఉంటూ.. ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ.. అధికారులకు సమాచారం అందిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపుచేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

 

#WATCH Massive fire at the gas well of Oil India Ltd at Baghjan in Tinsukia district, Assam. A team of National Disaster Response Force (NDRF) is present at the spot pic.twitter.com/Tw2G92aPXy

— ANI (@ANI) June 9, 2020