ఎలా వస్తాయిరా ఈ ఐడియాలు.. టిప్‌టాప్‌గా ఎయిర్‌పోర్టులో దిగారు.. అనుమానం వచ్చి లగేజ్ చెక్‌చేయగా..

బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారీ భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న నలుగురు విదేశీయుల నుంచి సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 273 కేజీల గంజాయిను కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకొని ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఎలా వస్తాయిరా ఈ ఐడియాలు.. టిప్‌టాప్‌గా ఎయిర్‌పోర్టులో దిగారు.. అనుమానం వచ్చి లగేజ్ చెక్‌చేయగా..
Representative Image

Updated on: Nov 29, 2025 | 2:15 PM

దేశంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా రోజురోజుకూ పెరిగి పోతుంది. దీనిపై దృష్టి పెట్టిన కస్టమ్స్ అధికారులు గంజాయి అక్రమరవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.200 కోట్ల విలువైన విదేశీ గంజాయిని బెంగుళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు.బ్యాంకాక్ నుంచి బెంగుళూరు వచ్చిన నలుగురు విదేశీయుల నుంచి మొత్తం రూ. 200 కోట్ల విలువ చేసే 273 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకన్నారు.

బ్యాంకాక్ నుంచి బెంగుళూరు చేరుకున్న నలుగురు విదేశీయుల గుట్టుచప్పుడు కాకుండా ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ వారి ప్రవర్తనపై అనుమానం వచ్చిన ఎయిర్‌ పోర్ట్ సిబ్బంది వాళ్లను అడ్డుకున్నారు. వారి వద్ద ఉన్న బ్యాగ్‌లు, వస్తువులను తనిఖీ చేయగా అసలు గుట్టు రట్టైంది. ఎనర్జీ డ్రింక్‌ బాటిల్స్‌లో గంజాయి దాటి అక్రమంగా తరలిస్తున్నట్టు తనిఖీ సిబ్బంది గుర్తించారు. వెంటనే కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కస్టమ్స్ అధికారులు నలుగురు విదేశీయులతో పాటు పాటు 32 మందిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 273 కేజీల విదేశీ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పట్టుబడిన గంజాయి మొత్తం విదేశీది కావడంతో, అంతర్జాతీయ స్థాయిలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై అధికారులు దృష్టి సారించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.