ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలలో భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. జూన్ 4న రాష్ట్రంలో ఇదే తరహాలో మంచు కురిసింది. ఇది హేమ్‌కుండ్ సాహిబ్‌కు వెళుతున్న యాత్రికుల బృందాన్ని ఢీకొట్టింది. వారిలో ఐదుగురిని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (ఎస్‌డిఆర్‌ఎఫ్) బృందం రక్షించింది. రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభించిన తర్వాత జూన్ 5న యాత్రికుల మృతదేహాలను వెలికితీశారు.
మరోవైపు, కేదార్‌నాథ్ ధామ్ యాత్ర కోసం ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 10 వరకు, ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 15 వరకు నిలిపివేశారు. ఇప్పటికే పేర్లు నమోదు చేసుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. టూరిజం శాఖ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 41 లక్షల మంది భక్తులు చార్ధామ్ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖ నివేదిక ప్రకారం, వాతావరణం అనుకూలించినప్పుడు ప్రతిరోజూ 60 వేల మందికి పైగా యాత్రికులు కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు.
#WATCH | Uttarakhand: An avalanche occurred this morning in the Himalayan region but no damage was sustained to the Kedarnath temple: Shri Badrinath-Kedarnath Temple Committee President, Ajendra Ajay pic.twitter.com/fyi2WofTqZ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 1, 2022
గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను చార్ ధామ్ అంటారు. ఏప్రిల్ 22 అక్షయ తృతీయ రోజున భక్తుల దర్శనం కోసం గంగోత్రి, యమునోత్రి ఆలయ తలుపులు తెరవబడ్డాయి. కేదార్‌నాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 25న, బద్రీనాథ్ ధామ్ తలుపులు ఏప్రిల్ 27న తెరవబడ్డాయి.
VIDEO | A massive avalanche hit mountains around Kedarnath Temple earlier today. pic.twitter.com/QqwKxrDsOW
— Press Trust of India (@PTI_News) June 8, 2023
మరిన్ని జాతీయ వార్తల కోసం