విందుకు వచ్చారా.. దాడికి వచ్చారా? పెళ్లి హాల్లో రణరంగం.. అతిథుల్లా వచ్చి దాడికి తెగబడ్డ యువకులు!

పెళ్లి అంటే ఆనందం, సందడి, బంధుమిత్రులతో సెలబ్రేషన్.. కానీ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ ఘటన మాత్రం పెళ్లి వేడుకను క్షణాల్లో రణరంగంగా మార్చేసింది. అతిథుల్లా మ్యారేజ్ హాల్‌లోకి ప్రవేశించిన యువకులు ఒక్కసారిగా దాడికి దిగడంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

విందుకు వచ్చారా.. దాడికి వచ్చారా? పెళ్లి హాల్లో రణరంగం.. అతిథుల్లా వచ్చి దాడికి తెగబడ్డ యువకులు!
Fight In Marriage

Updated on: Jul 06, 2026 | 2:24 PM

పెళ్లి అంటే ఆనందం, సందడి, బంధుమిత్రులతో సెలబ్రేషన్.. కానీ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఓ ఘటన మాత్రం పెళ్లి వేడుకను క్షణాల్లో రణరంగంగా మార్చేసింది. అతిథుల్లా మ్యారేజ్ హాల్‌లోకి ప్రవేశించిన యువకులు ఒక్కసారిగా దాడికి దిగడంతో అక్కడ ఉన్నవారంతా భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

జేవర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డీ గ్రౌండ్ హోటల్ అండ్ మ్యారేజ్ హోమ్‌లో పెళ్లి వేడుక జరుగుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తొలుత సాధారణ అతిథుల్లా హాల్‌లోకి వచ్చిన యువకులు, కొద్దిసేపటికే కొందరిని లక్ష్యంగా చేసుకుని పిడిగుద్దులు, తన్నులతో రెచ్చిపోయారు. దీంతో వేడుకకు వచ్చిన వారు ప్రాణభయంతో పరుగులు తీశారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

వ్యక్తిగత కక్షతో దాడి చేశారా? లేక పెళ్లికి వచ్చిన వారిలో ఎవరినైనా లక్ష్యంగా చేసుకుని వచ్చారా? నిజంగానే అతిథుల ముసుగులో హాల్‌లోకి ప్రవేశించారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, వైరల్ వీడియోతో పాటు మ్యారేజ్ హాల్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన వెనుక అసలు కారణం ఏమిటి? దుండగులు ఎవరు? వారికి పెళ్లి కుటుంబంతో సంబంధం ఉందా? లేక ముందే పథకం ప్రకారం ఈ దాడికి పాల్పడ్డారా? అనే ప్రశ్నలకు సమాధానాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us