Rakeshwar Singh: మావోయిస్టుల చెరనుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల

ఐదురోజులుగా తమ చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడుదల చేశారు.

Rakeshwar  Singh: మావోయిస్టుల చెరనుంచి రాకేశ్వర్ సింగ్ విడుదల
Rakeshwar Singh

Updated on: Apr 08, 2021 | 6:35 PM

ఐదురోజులుగా తమ చెరలో ఉన్న కోబ్రా జవాన్ రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు విడుదల చేశారు. ఛత్తీస్‌గడ్‌లోని బీజపూర్ జిల్లా తర్రెమ్ అటవీప్రాంతంలోని జొన్నగూడ దగ్గర భారీ ఎన్ కౌంటర్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 24 మంది జవాన్లు మృతి చెందారు. అంతేకాకుండా 31 మంది జవాన్లు గాయపడి చికిత్స పొందుతున్నారు. ఈ దాడి తరువాత రాకేశ్వర్ సింగ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. చర్చలకు ప్రభుత్వం వస్తేనే రాకేష్ సింగ్ ను విడుదల చేస్తామంటూ పలు షరతులు పెట్టారు.

రాకేష్ సింగ్ విడుదలను ఛత్తీస్ గఢ్ ఐజీ ధ్రువీకరించారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధం అనీ.. మధ్యవర్తులను ప్రకటించాలనీ డిమాండ్ చేస్తూ విడుదల చేసిన లేఖపై ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు. అయినప్పటికీ మావోయిస్టులు బేషరతుగా రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేయడం ఆసక్తి ఏకేత్తిస్తోంది. ఇక కాసేపట్లో రాకేశ్వర్ సింగ్ తన బెటాలియన్ కు చేరుకోనున్నారు.

Also Read: ఏపీలో మత్తు కలకలం, డ్రగ్స్ వాడటం ఎంత డేంజరో చెబుతూ విద్యార్థుల్లో అవగాహన కల్పిస్తున్న పోలీసులు

ఛత్తీస్‌గడ్ మారణహోమానికి అసలు సూత్రధారి.. ఫ్లాన్ చేస్తే పక్కా గురి.. ఎవరీ మడవి హిడ్మా?