Chhattisgarh Maoists: ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. రోడ్డు నిర్మాణ పనుల్లో సూపర్ వైజర్‌ను కొట్టి దారుణంగా కొట్టిన చంపేశారు. ముగ్గురిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు ఒకరిని హతమార్చారు. అంతేకాదు ఒక టిప్పర్, డోజర్‌ను మావోయిస్టులు తగులబెట్టారు. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన సూపర్ వైజర్ రాజమండ్రికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.
కాగా, ఇటీవల బీజాపూర్-సుకుమా జిల్లాల మధ్య ఎదురు కాల్పుల్లో మావోయిస్టుల చేతిలో 22 మంది జవాన్లు బలైన విషయం తెలిసిందే. గతంలో కూడా దంతెవాడలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే జవాన్లు అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఉపయోగించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని రిటైర్డ్ ఐపీఎస్‌లు అభిప్రాయపడుతున్నారు.
అలాగే గత రెండు రోజుల కిందట సుక్మా జిల్లాలో ఇద్దరు పోలీసులు దారుణ హత్యకు గురయ్యారు. హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గొంతుకోసి దుండగులు దారుణంగా హత్య చేశారు. బెజ్జి పోలీస్‌స్టేషన్‌కు చెందిన అసిస్టెంట్ కానిస్టేబుళ్లు పూనెం హరీమ్ (30), ధనిరాం కశ్యప్ (31) ద్విచక్ర వాహనంపై సమీపంలోని ఓ గ్రామంలో ఉన్న వైద్యశాలకు పనిపై వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా.. మార్గమధ్యలో ద్విచక్ర వాహనాన్ని అటకాయించిన గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేయగా అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.అయితే వీరిని హత్య చేసింది మావోయిస్టులేనా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి భద్రతా బలగాలు.
ఇలా మావోయిస్టులకు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం అడ్డగా మారింది. నిత్యం ఏదో ఒక చోటు మావోలు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో అనేకమార్లు తీవ్ర బీభత్సం సృష్టించారు. వాహనాలను తగులబెట్టడం, వంతెనలను కూల్చవేయడం, పనులు చేసేవారిని చంపేయడం లాంటివి చాలా జరిగాయి. ఈ ప్రాంతాల్లో మావోయిస్టులు అనునిత్యం సంచరిస్తుండటంతో భద్రతా బలగాలు కూడా ప్రతి రోజు గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నాయి. మావోయిస్టులను ఏరివేతలో భాగంగా చాలా మంది మావోయిస్టులు హతమైనా.. ఇంకా వారి అగడాలు ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇవీ చదవండి: Nirav Modi: బ్యాంకును మోసం చేసిన కేసులో నీరవ్ మోడీని భారత్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం
ఆన్‌లైన్ గిఫ్ట్స్ పేరుతో అమాయకులకు టోకరా.. అడ్డంగా బుక్కైన ముఠా.. పట్టుబడ్డ వారంతా 35 ఏళ్లలోపే..!