ఇక నుంచి మద్యం ప్రియులు బార్ లేదా వైన్ షాపుల్లో మద్యం కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఈ మధ్య కాలంలో నకిలీ మద్యం అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. దీంతో మద్యం తాగాలంటేనే మందుబాబులు భయపడుతున్నారు. కర్ణాటకలో మండ్య జిల్లా బీటీ లలితా నాయక్ బరాంగేలో ఆదివారం ఎక్సైజ్ శాఖ అధికారులు జరిపిన దాడిలో భారీ నకిలీ మద్యం రాకెట్ బయటపడింది. మరోవైపు స్పిరిట్‌తో నిండిన డబ్బాలు, ఖరీదైన మద్యం బాటిళ్లు కూడా దర్శినమిచ్చాయి.
‘కామధేను కంఫర్ట్స్’ పేరుతో ఓ ముఠా ఇంటిని అద్దెకు తీసుకుని ప్రముఖ కంపెనీల పేరుతో నకిలీ మద్యం వ్యాపారం సాగించింది. ఇంట్లో మద్యం సాచెట్‌లు, స్టిక్కర్ల తయారీ యంత్రాన్ని ఉంచుకున్నారు. కర్ణాటక ప్రభుత్వ చిహ్నాన్ని, ఎక్సైజ్ శాఖ గుర్తును కూడా వినియోగిస్తున్నట్లు ఎక్సైజ్ డీవైఎస్పీ సోమశేఖర్ తెలిపారు.
పక్కా సమాచారంతో ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. హండ్రెడ్ పైపర్స్, ఎంసీ విస్కీ, బ్లాక్ అండ్ వైట్, టీచర్స్ స్కాచ్, ఇంపీరియల్ బ్లూ, హండ్రెడ్ పైపర్స్, ఎంసీ విస్కీ, సిల్వర్ కప్ సాచెట్ దొరికాయి. ఈ దాడిలో 35 లీటర్ల నకిలీ మద్యం ప్యాకెట్లు లభ్యమయ్యాయి. 590 లీటర్ల స్పిరిట్, 30 లీటర్ల నకిలీ మద్యం, స్టిక్కర్ తయారీ యంత్రం, ముడిసరుకు స్వాధీనం చేసుకున్నారు. ఒక నిందితుడిని పోలీసులు పట్టుకోగా మిగిలిన వారు పరారయ్యారు. మద్యం ప్రియుల జీవితాలతో ఆడుకుంటున్న ఈ వ్యాపారం వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉంది. ఖదీమా ముఠా ఏయే బార్ అండ్ రెస్టారెంట్లకు నకిలీ మద్యం సరఫరా చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం విచారణలో తెలియాల్సి ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి