Manmohan Singh Health Update: తీవ్ర జ్వరంతో బాధపడుతున్న భారత మాజీ ప్రధాని 89 ఏళ్ల మన్మోహన్ సింగ్ గత కొన్ని రోజుల క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరిన సంగతి తెలిసిందే.. కార్డియో-న్యూరో సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా మన్మోహన్ సింగ్ హెల్త్ బులెటిన్ ను ఎయిమ్స్ వైద్యులు రిలీజ్ చేశారు. మన్మోహన్ సింగ్ క్రమంగా కోలుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. వైద్యులు చెప్పారు.
ఇక మన్మోహన్ సింగ్ కుమార్తె డామన్ సింగ్ తన తండ్రి ఆరోగ్యంపై స్పందించారు. ప్రస్తుతం మా నాన్నగారు ఎయిమ్స్‌లో డెంగ్యూతో చికిత్స పొందుతున్నారు… పరిస్థితి స్థిరంగా ఉంది అయితే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని చెప్పారు, అందుకనే తన తండ్రిని చూడడానికి వచ్చే వారి సంఖ్యను పరిమితం చేసినట్లు తెలిపారు. తన తండ్రి మన్మోహన్ సింగ్ ని ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా పరామర్శించడం .. త్వరగా కోలుకోవాలని కోరుకోవడం ఆనందంగా ఉందని.. అయితే అదే సమయంలో ఆయన ఫోటోలు తీయడం మాత్రం అభ్యంతర కరమని చెప్పారు.
ప్రస్తుతం డాక్టర్ నితీష్ నాయక్ నేతృత్వంలోని కార్డియాలజిస్టుల బృందం సంరక్షణలో మన్మోహన్ సింగ్ ఉన్నట్లు చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ట్వీట్లు చేశారు గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు మన్మోహన్ సింగ్‌ను పరామర్శించారు. ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Also Read: రేపు తులామాసం పూజల కోసం తెరుచుకోనున్న అయ్యప్ప ఆలయం.. ఆదివారం నుంచి భక్తులకు అనుమతి