సెలవులు కావాలి.. మన్మోహన్ సహా 14 మంది ఎంపీల దరఖాస్తు

| Edited By:

Sep 16, 2020 | 11:11 AM

పార్లమెంట్‌కి కరోనా సెగ తగిలిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలకు మందు జరిపిన పరీక్షల్లో 17 మంది లోక్‌సభ, 8 మంది రాజ్యసభ ఎంపీలకు

సెలవులు కావాలి.. మన్మోహన్ సహా 14 మంది ఎంపీల దరఖాస్తు
Follow us on

MPs applied leaves: పార్లమెంట్‌కి కరోనా సెగ తగిలిన విషయం తెలిసిందే. పార్లమెంట్ సమావేశాలకు మందు జరిపిన పరీక్షల్లో 17 మంది లోక్‌సభ, 8 మంది రాజ్యసభ ఎంపీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరితో పాటు 50 మంది సిబ్బందికి సైతం కరోనా సోకింది. ఈ క్రమంలో పలువురు సీనియర్లు బయపడుతుండగా.. తమకు సెలవులు కావాలంటూ 14 మంది ఎంపీలు దరఖాస్తు చేసుకోవడం ఇప్పుడు ఆసక్తిగా మారింది. అందులో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కూడా ఉన్నారు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు తమకు సెలవులు కావాలని వారు దరఖాస్తులో పేర్కొన్నారు.

కాగా కరోనా సోకిన వారిలో బీజేపీకి చెందిన 12 మంది ఎంపీలు ఉన్నారు. ఇక ఏపీలో ఇద్దరు వైసీపీ ఎంపీలు(అరకు ఎంపీ మాధవి, చిత్తూరు ఎంపీ రెడ్డప్ప) ఉన్నారు. అలాగే శివసేన, డీఎంకే, ఆర్‌ఎల్‌పీ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు ఉన్నారు. వీరిలో కొందరు క్వారంటైన్‌లో ఉండగా.. మరికొందరు ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

Read More:

ఆ బ్లాక్‌బస్టర్‌ని విజయ్ వదులుకున్నాడు.. రివీల్ చేసిన శంకర్

15 సెకన్లలోనే కరోనా వైరస్ అంతం