Crime News: మరి ఇంత దారుణమా.. స్కూటర్‌ను తాకడని కత్తితో పొడిచి పొడిచి చంపాడు.. చివరకు

ఆదివారం నాడు వైన్ షాపు సమీపంలో నిందితుడి స్కూటర్‌ను బాధితుడు.. అతని స్నేహితుడు తాకడంతో గొడవ జరిగింది. మద్యం కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

Crime News: మరి ఇంత దారుణమా.. స్కూటర్‌ను తాకడని కత్తితో పొడిచి పొడిచి చంపాడు.. చివరకు
Crime

Updated on: Jul 04, 2022 | 5:19 PM

Man stabbed to death: కొంతమంది క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. వేరేవారిది కూడా ప్రాణమేనన్న.. జ్ఞానాన్ని మరిచి ప్రాణాలను తీస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తూర్పు ఢిల్లీలో స్కూటర్‌ను తాకడాన్న కారణంతో ఓ వ్యక్తి కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈఘటన ఢిల్లీలోని (East Delhi) సమస్పూర్ ప్రాంతంలోని ఒక వైన్ షాపు దగ్గర జరిగింది. తూర్పు ఢిల్లీలోని సమస్పూర్‌లోని ఓ వైన్ షాప్ బయట 20 ఏళ్ల యువకుడిని కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం నాడు వైన్ షాపు సమీపంలో నిందితుడి స్కూటర్‌ను బాధితుడు.. అతని స్నేహితుడు తాకడంతో గొడవ జరిగింది. మద్యం కొనుగోలు చేసి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. వారితో గొడవ పడిన వ్యక్తి స్నేహితుడితో కలిసి మళ్లీ అక్కడికి వచ్చాడు. వారిలో ఒకరు బాధితుడి ఛాతీపై ఇనుప వస్తువుతో కొట్టడంతోపాటు పొడిచి తీవ్రంగా గాయపరిచారని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై ఆదివారం రాత్రి 8:42 గంటలకు పాండవ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందిందని డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (ఈస్ట్) ప్రియాంక కశ్యప్ తెలిపారు. గాయపడిన తర్వాత బాధితుడిని అతని స్నేహితుడు ఖిచ్రిపూర్‌లోని ఎల్‌బిఎస్ ఆసుపత్రిలో చేర్చారని.. అతను అప్పటికే మరణించినట్లు తెలిపారు. సమాస్‌పూర్‌లోని వైన్‌షాప్‌ సమీపంలో మృతుడు తన స్నేహితుడితో పాటు గుర్తుతెలియని స్కూటర్‌ను తాకినప్పుడు అతనితో గొడవ పడ్డాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం నిందితులు పారిపోయినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నామని ప్రయాంక కశ్యప్ తెలిపారు. నేరస్థులను గుర్తించడానికి పరిసర ప్రాంతాల్లోని అన్ని సిసి కెమెరాలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us