చాయ్ లో చక్కెర తక్కువైందని భార్యను చంపేశాడు..

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. టీ కప్పులో చక్కెర తగ్గిందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ శాడిస్టు మొగుడు. తన భార్య గర్భవతి అని చూడకుండా ఆమెను హత్యచేశాడు కసాయి భర్త.

చాయ్ లో చక్కెర తక్కువైందని భార్యను చంపేశాడు..

Updated on: Jun 24, 2020 | 4:37 PM

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. టీ కప్పులో చక్కెర తగ్గిందని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఓ శాడిస్టు మొగుడు. తన భార్య గర్భవతి అని చూడకుండా ఆమెను హత్యచేశాడు కసాయి భర్త.

లఖింపూర్ జిల్లా బార్బర్ ప్రాంతానికి చెందిన బాబ్లూ కుమార్, భార్య రేణు (35) దంపతులు. బాబ్లూతో పన్నెండేళ్ల క్రితం రేణుతో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మరోసారి ఆమె గర్భవతి అయ్యింది. అయితే గత సోమవారం తెల్లవారు జామున బాబ్లూ టీ కావాలని భార్యకు చెప్పాడు. దీంతో ఆమె అతనికి టీ చేసి ఇచ్చింది. భార్య అందించిన టీ కప్పులో చక్కెర తక్కువగా వేసిందని బబ్లూ ఆగ్రహంతో ఊగిపోయాడు. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయి కొడుకు కొట్టి భార్యను కత్తితో గొంతు కోసి చంపాడు. దీంతో రేణు అక్కడిక్కడే కుప్పకూలింది. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించేలోపే ఆమె మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

రేణు తండ్రి బద్రీ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. తన తండ్రే తమ తల్లిని హత్య చేశాడని వారి ముగ్గురు పిల్లలు పోలీసులకు వివరించారు. హత్యకు ఉపయోగించి కత్తిని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.