దేశంలో మరో కొత్త వైరస్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటి దాకా కరోనా వైరస్‌తో అవస్థలు పడుతున్న ప్రజల్ని తాజా వైరస్ కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. మరో ట్విస్ట్ ఏంటంటే..అది కూడా కేరళలోనే తొలి కొత్త వైరస్ వెస్ట్ నైలు కేసు బయటపడింది. త్రిసూర్‌లో వెక్టార్-బోర్న్ డిసీజ్‌తో చికిత్స పొందుతున్న వ్యక్తి మృత్యువాతపడ్డటంతో అక్కడ ప్రభుత్తం అప్రమత్తమైంది. ఈ మధ్య కాలంలో దేశంలో నమోదైన వెస్ట్ నైలు మొదటి కేసు ఇదేనని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ వైరస్ క్యూలెక్స్ జాతుల దోమల ద్వారా వ్యాపిస్తుందని వైద్య తెలిపింది. మరోవైపు మున్సిపల్ కార్పొరేషన్‌కు ప్రత్యేక అదేశాలు జారీ చేసింది.
వెస్ట్ నైలు జ్వరం కారణంగా 2019లో కేరళలో అనేక మంది మరణించారు.. దాంతో ఈసారి రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే అప్రమత్తమైంది. ప్రతి జిల్లాలో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది. ఈ జ్వరం బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు కావలసిన ఔషధాలను ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇకపోతే, వెస్ట్ నైలు వైరస్ బారినపడ్డ మనిషికి తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు లేదా దద్దుర్లతో కూడా జ్వరం వస్తున్నట్టు గుర్తించారు వైద్యాధికారులు.. ఈ వైరస్ సోకిన వారిలో చాలా మంది వ్యక్తులు పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. అయితే వ్యాధి తగ్గిన తర్వాత అలసట, బలహీనత వారాలు లేదా నెలల పాటు ఉంటుందని చెప్పారు. CDC ప్రకారం, వైరస్ సోకిన 150 మందిలో ఒకరికి కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేసి తీవ్రమైన అనారోగ్యానికి గురిచేస్తుంది. మెదడు వాపు లేదా మెనింజైటిస్ అంటే, మెదడు వెన్నుపూస చుట్టూ ఉండే పొరల వాపు వంటివి ఏర్పడుతుందని వైద్యాధికారులు వెల్లడించారు. మీ చుట్టుపక్కల ఎవరిలోనైనా వెస్ట్ నైల్ వైరస్ వ్యాధి లక్షలుగా భావిస్తే తక్షణమే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.