Sneezing Death: తుమ్ములతో మృతిచెందిన యువకుడు.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు..

|

Dec 06, 2022 | 8:23 AM

రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు తుమ్ములు వచ్చి మృతి చెందాడు. వీడియోలో యువకుడు మొదట అతని ఛాతీపై చేయి వేసుకున్నాడు. ఆపై తుమ్ముతూ నోటిపై చేయి వేసుకున్నట్లు వీడియోలో చూడవచ్చు.

Sneezing Death: తుమ్ములతో మృతిచెందిన యువకుడు.. సీసీ కెమెరాలో రికార్డైన షాకింగ్‌ దృశ్యాలు..
Cc Tv Photage
Follow us on

ఆరోగ్యంగా కనిపిస్తున్న ఓ యువకుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు తన స్నేహితులతో కలిసి సరదాగా వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా తుమ్ములు వచ్చి చనిపోయే షాకింగ్ సంఘటన కెమెరాలో చిక్కుకుంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తీవ్ర కలకలం రేపుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఈ షాకింగ్ కేసు ఇంటర్‌ నెట్‌ ద్వారా వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ యువకుడు తుమ్ములు వచ్చి మృతి చెందాడు. వీడియోలో యువకుడు మొదట అతని ఛాతీపై చేయి వేసుకున్నాడు. ఆపై తుమ్ముతూ నోటిపై చేయి వేసుకున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత కొన్ని క్షణాలు నడిచిన తరువాత అతను కిందపడిపోయాడు. ఆ తర్వాత మళ్లీ లేవలేదు. ఆ యువకుడికి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి 2 సెకన్లలోపే మృతి చెందినట్లు చెబుతున్నారు. ఈ ఘటనతో యువకుడితో వెళ్తున్న స్నేహితులు కూడా షాక్‌కు గురయ్యారు. మార్గమధ్యంలో ఓ ఇంట్లో అమర్చిన సీసీటీవీలో ఈ దృశ్యం మొత్తం రికార్డైంది.

హుటాహుటినా స్నేహితులు అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కానీ, ఫలితం లేకపోయింది. అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీన్ని పోస్ట్ కోవిడ్ సింప్టమ్‌గా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. కోవిడ్ బారినపడి, కోలుకున్న వారిలో కొంత మంది ఆ తర్వాత.. గుండెపోటుతో అకస్మాత్తుగా మరణిస్తున్న ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా నమోదవుతున్నాయి. అలా మరణిస్తున్న వారిలో ఎక్కువ శాతం యువతే ఉండటం మరింత విచారకరమైన అంశం. ఇలాంటి సంఘటనలు ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో కనీసం అరడజనుకు పైగా చోటు చేసుకున్నట్టుగా తెలిసింది. కొందరు యువకులు నృత్యం చేస్తూ, మాట్లాడేటప్పుడు కుప్పకూలి మరణించారు. రెండు రోజుల క్రితం పెళ్లి మండపంలోనే ఓ వధువు వరుడి మెడలో పూలమాల వేసే క్రమంలో వేదికపైనే పడి మృతి చెందింది. ఇది కోవిడ్ అనంతర జరుగుతున్న ఘటనలుగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున సైలెంట్‌ హార్ట్‌ఎటాక్‌ను ఎదుర్కొంటున్నట్టుగా వివరించారు.

ఇవి కూడా చదవండి

ఒక్క యూపీలోనే కాదు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆరోగ్యంగా కనిపించే వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడంతో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. రాంలీలా సమయంలో వేదికపై ప్రదర్శన చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు నృత్యం చేస్తున్నప్పుడు, కొన్నిసార్లు దేవుని పాదాల వద్ద తలలు పెట్టుకుని మరణించారు. జమ్మూకశ్మీర్‌లో పార్వతి పాత్ర పోషిస్తున్న వ్యక్తి స్టేజ్‌పైనే చనిపోగా, యూపీలో కూడా హనుమంతుడిగా నటించిన వ్యక్తి గుండెపోటుతో ఇలాగే మరణించాడు. ఇప్పుడు దానికి మీరట్ ఘటన కూడా తోడైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి