Viral Video: షోలే సినిమాలో ధర్మేంద్రను గుర్తుచేశాడు.. భార్య కాపురానికి రావటం లేదని యువకుడు చేసిన పని..

భార్యను తనతో పంపాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగాడు. విషయం తెలిసి ఊరిజనం, చుట్టు పక్కల గ్రామస్తులు సైతం భారీగా అక్కడకు చేరుకున్నారు. ఎవరూ చెప్పిన అతడు వినిపించుకోలేదు.

Viral Video: షోలే సినిమాలో ధర్మేంద్రను గుర్తుచేశాడు.. భార్య కాపురానికి రావటం లేదని యువకుడు చేసిన పని..
Man Climbs High Tension Tow

Updated on: Sep 21, 2022 | 8:41 PM

Viral Video: భార్య కాపురానికి రావటంలేదని సెల్‌టవర్ ఎక్కిన భర్త ఆత్యహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఏకంగా 75 అడుగుల ఎత్తైన హై టెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. దాంతో ఆ ఊరంతా ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి.. అతన్ని కిందకు దింపారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. సీన్‌ సినిమాను తలపించిందని, షోలే ధర్మేంద్రను గుర్తు చేశాడంటూ కొందరు నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ఇంతకీ ఆ యువకుడు ఏం చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఛత్తీస్‌గఢ్‌ భిలాయ్‌లోని గనియారి గ్రామానికి చెందిన యువతితో హోరీ లాల్‌కు ఇటీవలే వివాహం జరిగింది. ఈ క్రమంలోనే పుట్టింట్లో ఉంటున్న భార్యను తనతో తీసుకువెళ్లేందుకు వచ్చాడు హోరీ లాల్..అయితే, భార్యను తనతో పంపేందుకు అత్తమామలు నిరాకరించారు. దీంతో ఆగ్రహించిన ఆ వ్యక్తి గ్రామంలో ఉన్న 75 అడుగుల పొడవైన హై టెన్షన్ విద్యుత్‌ టవర్ ఎక్కాడు. భార్యను తనతో పంపాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగాడు. విషయం తెలిసి ఊరిజనం, చుట్టు పక్కల గ్రామస్తులు సైతం భారీగా అక్కడకు చేరుకున్నారు. ఎవరూ చెప్పిన అతడు వినిపించుకోలేదు. దాంతో ఆ ప్రాంతమంతా టెన్షన్‌ వాతావరణం ఏర్పడింది.

ఇవి కూడా చదవండి

చివరకు విషయం పోలీసులకు చేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు…హోరి లాల్‌కు నచ్చజెప్పి హై టెన్షన్ విద్యుత్‌ టవర్ పైనుంచి కిందకు రప్పించేందుకు ప్రయత్నించారు. తొలుత అతడు నిరాకరించాడు. అయితే భార్యను అతడితో పంపుతామని పోలీసులు హామీ ఇచ్చారు. దీంతో అతడు ఆ హై టెన్షన్‌ విద్యుత్‌ టవర్‌ పైనుంచి కిందకు దిగాడు. అనంతరం పోలీసులు హోరి లాల్‌ను, అతడి అత్తామామలను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్‌ ఇప్పించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి