Crime in UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. జామ పళ్లు తెంపొద్దన్నకు అందరూ కలిసి వ్యక్తి ప్రాణాలు తీశారు..!

Crime in UP: ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఇంటి లోపల ఉన్న జామ చెట్టుకు జామ కాయను తెంపొద్దని వారించినందుకు..

Crime in UP: ఉత్తరప్రదేశ్‌లో దారుణం.. జామ పళ్లు తెంపొద్దన్నకు అందరూ కలిసి వ్యక్తి ప్రాణాలు తీశారు..!

Updated on: Feb 25, 2021 | 11:25 PM

Crime in UP: ఉత్తరప్రదేశ్‌లో దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి తన ఇంటి లోపల ఉన్న జామ చెట్టుకు జామ కాయను తెంపొద్దని వారించినందుకు అతన్ని పొట్టు పొట్టుగా కొట్టారు. ఈ సంఘటన యూపీ, రాంపూర్ లోని షేక్పురా గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. ఒక వ్యక్తి తన పొరుగింట్లో ఉన్న జామచెట్టుకు పండు కొయడానికి ప్రయత్నించాడు. దాంతో చెట్టు యజమాని జామ పళ్లు కొయొద్దంటూ వారించాడు. అలా ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. ఇది ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీసింది. చివరికి 27 సంవత్సరాల మహఫుజ్ అలీని కొందరు వ్యక్తులు చుట్టుముట్టి చావుదెబ్బలు కొట్టారు. అనంతరం నిందితులు అక్కడి నుంచి పారిపోయారు.

అయితే, వీరి చేతిలో చావు దెబ్బలు తిన్న బాధితుడు.. చికిత్స సమయంలో మరణించాడు. అజీమ్ నగర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ రవీంద్ర కుమార్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నారు. నిందితులు కొట్టిన గాయాల వల్లే మహాఫుజ్ చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందన్నారు. భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 304 కింద 2 దోషులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, మృతునిపై దాడి చేసిన వారిలో నిందితుడు షకీర్‌ను అరెస్టు చేశారు.

Also read:

పొరపాటున కూడా ముఖం మీద ఇవి రాయొద్దు.. రాసారో అందవికారంగా మారడం ఖాయం..!

జుట్టు రాలిపోవడం, తెల్లబడటం జరుగుతుందా?.. ఇలా చేసి అద్భుతమైన జట్టును పొందండి..!

Follow Us