
ఈ మధ్య విమానాల్లో మహిళలపై మూత్రం పోసిన ఘటన రెండు మూడు వెలుగు చూసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. అయితే ఈసారి విమానంలో కాకుండా విమానాశ్రయం బటయ చోటు చేసుకుందీ ఘటన. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ఎంట్రీ వద్ద ఓ వ్యక్తి బహిరంగంగా మూత్ర విసర్జన చేశాడు. అది గమనించిన ఎయిర్‌పోర్టు భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదల చేశారు. జనవరి 8వ తేదీన చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
జనవరి 8వ తేదీన ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు టి3 వద్ద డిపార్చర్ గేట్ 6 ముందు ఓ వ్యక్తి బహిరంగ మూత్ర విసర్జన చేశాడు. అది గమనించిన సిబ్బంది వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సదరు వ్యక్తి ఢిల్లీ నుంచి దమ్మామ్‌కు విమాన ప్రయాణం చేయాల్సి ఉండగా.. అతను చేసిన చర్యకు జైలు శిక్ష అనుభవించాల్సి వచ్చింది.
జౌహర్ అలీఖాన్.. జనవరి 8న ఢిల్లీ నుంచి దమ్మామ్‌కు వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నాడు. ఇందులో భాగంగా అతను ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు వచ్చాడు. అయితే, అప్పటికే అతను ఫుల్లుగా మద్యం సేవించి ఉన్నాడు. ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అలీఖాన్.. బయట కొందరు వ్యక్తులతో దుర్భాషలాడాడు. ఆ తరువాత ఎయిర్‌పోర్టు ఎంట్రన్స్ ముందు మూత్ర విసర్జన చేశాడు. వెంటనే అలర్ట్ అయిన ఢిల్లీ పోలీసులు.. అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత బెయిల్‌పై విడుదల చేశారు.
ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. గతేడాది డిసెంబర్ 6వ తేదీన పారిస్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన AI-142 విమానంలో ఒక ప్రయాణికుడు సిగరెట్ తాగడం, ఓ మహిళా ప్రయాణికురాలి డ్రెస్ చున్నీని తీసుకుని వాసన చూడటం వంటి అభ్యంతరకర పనులు చేశాడు. ఇక తాజాగా మద్యం మత్తులో ఉన్న ఓ ప్రయాణికుడు విమానంలోనే ఓ మహిళా ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..