Viral: ఎయిర్‌పోర్ట్‌లో కాస్త తేడాగా కనిపించిన ప్యాసింజర్.. అనుమానంతో చెక్ చేయగా కళ్లు జిగేల్..

ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం.. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.. వేలాది మంది ఈ ఎయిర్‌పోర్ట్ నుంచే పలు రాష్ట్రాలకు.. దేశాలకు.. రాకపోకలు సాగిస్తుంటారు.. అయితే.. ఫిబ్రవరి 12న ఎప్పటిలాగే.. తనిఖీలు జరుగుతున్నాయి.. వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మరో దేశం నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణిడిపై అధికారులకు అనుమానం కలిగింది..

Viral: ఎయిర్‌పోర్ట్‌లో కాస్త తేడాగా కనిపించిన ప్యాసింజర్.. అనుమానంతో చెక్ చేయగా కళ్లు జిగేల్..
Airport

Updated on: Feb 17, 2025 | 11:07 AM

ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయం.. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది.. వేలాది మంది ఈ ఎయిర్‌పోర్ట్ నుంచే పలు రాష్ట్రాలకు.. దేశాలకు.. రాకపోకలు సాగిస్తుంటారు.. అయితే.. ఫిబ్రవరి 12న ఎప్పటిలాగే.. తనిఖీలు జరుగుతున్నాయి.. వచ్చిపోయే వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే.. మరో దేశం నుంచి ఢిల్లీకి వచ్చిన ఓ ప్రయాణిడిపై అధికారులకు అనుమానం కలిగింది.. వెంటనే అతన్ని ఆపి తనిఖీలు చేశారు. ఒకటికి మూడుసార్లు అంతా లగేజీని పరిశీలించారు.. ఇలా పరిశీలిస్తున్న క్రమంలో స్కానింగ్ లో అధికారులకు.. ధగ ధగ మెరసిపోతున్న ఓ వస్తువు కంటపడింది.. ఆ తర్వాత చూడగా.. ఒక్కసారిగా కళ్లు జిగేల్ అన్నాయి.. అది అత్యంత ఖరీదైన నెక్లెస్‌ గా గుర్తించిన అధికారులు.. దానిని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారించారు.. ఆ నక్లెస్ విలువ దాదాపు రూ.6 కోట్లకు పైగా ఉంటుందని ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయంలో దాదాపు ఆరు కోట్ల రూపాయల విలువైన వజ్రాల హారాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు కస్టమ్స్ విభాగం ఆదివారం తెలిపింది. అరెస్టు అయిన వ్యక్తి భారతదేశానికి చెందిన వ్యక్తేనని.. ఫిబ్రవరి 12న ఎయిర్ ఇండియా విమానంలో బ్యాంకాక్ నుంచి వచ్చాడని అధికారులు తెలిపారు. ఐజిఐ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు ఆ ప్రయాణీకుడిని గుర్తించి, అతని ప్రొఫైల్ ఆధారంగా ఆపారని తెలిపారు.

ఇవి కూడా చదవండి


ఆ తర్వాత ఆ వ్యక్తి సామానులోని వజ్రాలతో పొదిగిన నెక్లెస్‌ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత కనుగొన్నట్లు తెలిపారు. ఈ నెక్లెస్ ఓవల్, దీర్ఘచతురస్రాకార వజ్రాలతో పొదిగి ఉందని.. అంతేకాకుండా ఖరీదైన లాకెట్టు కూడా ఉన్నట్లు తెలిపారు. చాలాపొరల్లో వజ్రాలు పొదిగారని.. 40గ్రాముల బరువు ఉన్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న నక్లెస్ విలువ రూ. 6,08,97,329 ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

నిందితుడిపై కస్టమ్స్ అధికారులు అక్రమ రవాణా కేసు నమోదు చేసి.. అరెస్ట్ చేశారు. అక్రమ రవాణా వస్తువులను స్వాధీనం చేసుకోవడానికి అనుమతించే కస్టమ్స్ చట్టం, 1962లోని సెక్షన్ 110 కింద ఆ నెక్లెస్‌ను జప్తు చేశారు. దీని వెనుక ఎవరున్నారనే దానిపై తదుపరి దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..