#COVID2019 ముఖ్యమంత్రులకు దీదీ లేఖ… ఎందుకంటే?

| Edited By: Pardhasaradhi Peri

Mar 26, 2020 | 4:36 PM

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని 18 మంది ముఖ్యమంత్రులకు గురువారం ఓ లేఖ రాశారు. అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వున్నారు.

#COVID2019 ముఖ్యమంత్రులకు దీదీ లేఖ... ఎందుకంటే?
Follow us on

Mamata Benerjee writes letter to Chief ministers: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశంలోని 18 మంది ముఖ్యమంత్రులకు గురువారం ఓ లేఖ రాశారు. అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కే.చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి ప్రభావంతో దేశమంతా లాక్ డౌన్ అమలవుతున్న తరుణంలో దీదీ ముఖ్యమంత్రులందరికీ లేఖ రాయడం జాతీయ స్థాయిలో ప్రాధాన్యత సంతరించుకుంది.

లాక్ డౌన్ నేపథ్యంలో పలువురు తమ సొంత ప్రాంతాలలో కాకుండా దేశంలో ఎక్కడెక్కడో వుండిపోయారు. తెలుగు ప్రజలు పలువురు ఇతర రాష్ట్రాలలోను వుండిపోయారు. ఇదే విధంగా బెంగాలీలు పలువురు దేశంలోని పలు రాష్ట్రాలలో ఉద్యోగ, ఉపాధి పనులలో భాగంగాను, పర్యాటకులుగాను ఇరుక్కుపోయారు. లాక్ డౌన్ నేపథ్యంలో తమ బెంగాలీ ప్రజలు పెద్ద సంఖ్యలో వేరే రాష్ట్రాల్లో వున్న విషయం గుర్తించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… వారికి సౌకర్యాలు కలిపించాల్సిందిగా కోరుతూ దేశంలో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

దేశం మొత్తం లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న పశ్చిమ బెంగాల్ ప్రజలకు సంబంధించి లేఖ రాసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బెంగాలీలకు ఇబ్బందులు ఎదురు కాకుండా చూడాలని ముఖ్యమంత్రులను కోరారు. ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న బెంగాల్ ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాలలోను పలువురు బెంగాలీలు వున్న నేపథ్యంలో తెలుగు ముఖ్యమంత్రులిద్దరికీ కూడా దీదీ లేఖ పంపారు.