Massive Fire At Kolkata: కోల్ కతాలోని బాగ్ బజార్ ప్రాంతంలో భారీగా ఎగసిపడిన మంటలు.. పలు పూరిగుడిసెలు దగ్ధం

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాగ్ బజార్ ప్రాంతంలోని ఉమెన్స్ కాలేజీ వద్ద ఒక్కసారిగా...

Massive Fire At Kolkata: కోల్ కతాలోని బాగ్ బజార్ ప్రాంతంలో భారీగా ఎగసిపడిన మంటలు.. పలు పూరిగుడిసెలు దగ్ధం

Updated on: Jan 14, 2021 | 2:55 PM

Massive Fire At Kolkata: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాగ్ బజార్ ప్రాంతంలోని ఉమెన్స్ కాలేజీ వద్ద ఒక్కసారిగా భారీ స్థాయిలో మంటలు ఎగసి పడ్డాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది 25 అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. సమీప మూరివాడలోని దాదాపు 40 ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. మంటలకు తోడు భారీగా గాలులు వీచడంతో ఫైర్ సిబ్బంది పోలీసుల సహాయంతో అతికష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే మరో వైపు మణిక్తల ప్రాంతంలో మంటలు వ్యాపించగా ఐదు ఫైర్‌ఇంజిన్లతో అదుపు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు స్పందించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆర్ధిక సాయం అందిస్తుందని చెప్పారు.

Also Read: చంచల్ గూడ మహిళా జైలుకు తరలించే ముందు అఖిల ప్రియకు కరోనా టెస్టుల నిర్వహణ