Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో నలుగురు సజీవదహనం

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టిగ్రి ఎక్స్ టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అన్నా చెల్లి సహా నలుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

Delhi Fire Accident: ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం.. మంటల్లో నలుగురు సజీవదహనం
Fire Accident

Updated on: Nov 30, 2025 | 8:14 AM

దేశ రాజధాని ఢిల్లీలోని టిగ్రి ఎక్స్‌టెన్షన్ ప్రాంతంలోని నాలుగు అంతస్తుల భవనంలో శనివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. మొదట సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్‌లోని చెప్పుల షూ షాపులో మంటలు చెలరేగాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆ తర్వాత పై అంతస్తులకు వ్యాపించి, మొత్తం భవనాన్ని చుట్టుముట్టాయి. వెంటనే ప్రమత్తమైన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు అగ్నిమాపక యంత్రాలు మంటలు అదుపులోకి తెచ్చాయి.

మంటలార్పిన అదుపులోకి తెచ్చిన వెంటనే.. మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు ఫైర్ సిబ్బంది. ప్రమాద స్థలంలో కాలిపోయిన మూడు మృతదేహాలను గుర్తించి.. బయటకు తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్ ద్వారా మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us