మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఓ షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడి షెగావ్ తాలూకాలో భారీగా జుట్టు రాలిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. అకస్మాత్తుగా జుట్టు రాలిపోతున్న ఇలాంటి రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ తీవ్రమైన కేసుగా పరిగణించిన ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిసీజ్ కంట్రోల్ బృందం పరిశోధించడానికి రంగంలోకి దిగింది. శాస్త్రవేత్తలు పరిశోధనను ప్రారంభించారు.ఈ వ్యాధికి కారణం త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని వైద్య శాఖ ప్రకటించింది.
ఒక్కసారిగా వెంట్రుకలు రాలిపోవడంతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. వెంట్రుకలు రాలిపోయే కేసులు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఓ మహిళ జుట్టు రాలుతున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఓ పల్లెటూరి మహిళ జుట్టు తేలిగ్గా రాలిపోతున్నట్లు కనిపించింది. దీంతో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్య శాఖ రంగంలోకి దిగింది. ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ బృందం బుల్దానాకు చేరుకుంది. ఈ విషయాన్ని పరిశోధించడానికి, జుట్టు రాలడానికి ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి బుల్దానాకు పయనమైంది.
పదిహేను రోజుల క్రితం షేగావ్ తాలూకాలో జుట్టు రాలిపోయిన కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత, షెగావ్, నందురా తాలూకాలో 156 మందికి పైగా రోగులు బట్టతల ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బట్టతలకి కారణమేమిటో, ఇంత జుట్టు ఎందుకు రాలిపోతుందో వైద్యారోగ్య శాఖ ఇంకా కనిపెట్టలేకపోయింది. ఇంతలో ఓ మహిళ జుట్టు రాలుతున్న వీడియో ఒకటి బయటకు రావడంతో కలకలం రేగుతోంది. ఆ మహిళ బోండ్‌గావ్‌లోని తన బంధువుల ఇంటికి వచ్చింది. ఈ మహిళ తలపై వెంట్రుకలు తేలికగా రాలిపోతున్నాయి. ఆమె పూర్తిగా బట్టతలగా మారింది. ఈ ఘటనతో గ్రామస్తుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది.
ఇంతలో, జుట్టు రాలడానికి గల కారణాలను తెలుసుకోవడానికి ICMR- నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ బృందం గ్రామానికి చేరుకుంది. షెగావ్ తాలూకాలోని సుమారు 13 గ్రామాల పౌరులలో జుట్టు రాలడం, బట్టతల సమస్య గురించి ఆరోగ్య శాఖ కూడా ఆశ్చర్యానికి గురవుతోంది. ఈ గ్రామాల్లోని రోగులను ముంబై, చెన్నై, ఢిల్లీకి చెందిన నిపుణులతో పరీక్షిస్తారని ఆరోగ్య మంత్రి ప్రతాపరావు జాదవ్ ప్రకటించారు. దీని ప్రకారం ICMR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ వైద్యుల బృందాలన్నీ ఈ గ్రామాలకు చేరుకున్నాయి. శాంపిల్స్ తీసి ల్యాబ్‌లో పరీక్షిస్తామని, అప్పుడే వ్యాధికి కారణమేమిటో వెల్లడిస్తామని చెప్పారు. శాంపిల్‌ను పరిశీలించిన తర్వాత నిర్ధారణకు వస్తామని వైద్యులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..