మూసి ఉన్న తలుపులు.. పాలు తెచ్చే వృద్ధుడు.. నిదా ఖాన్ రహస్య స్థావరాన్ని ఎలా కనిపెట్టారు?

మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ (TCS) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడులు, మానసిక హింసకు పాల్పడినట్లు నమోదైన సంచలన కేసులో మహారాష్ట్ర పోలీసులు కీలక విజయం సాధించారు. గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ఈ కేసులోని ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌ను ఛత్రపతి సంభాజీనగర్‌లో ఎట్టకేలకు అరెస్టు చేశారు.

మూసి ఉన్న తలుపులు.. పాలు తెచ్చే వృద్ధుడు.. నిదా ఖాన్ రహస్య స్థావరాన్ని ఎలా కనిపెట్టారు?
Nida Khan

Updated on: May 08, 2026 | 3:42 PM

మహారాష్ట్ర నాసిక్‌లోని టీసీఎస్ (TCS) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడులు, మానసిక హింసకు పాల్పడినట్లు నమోదైన సంచలన కేసులో మహారాష్ట్ర పోలీసులు కీలక విజయం సాధించారు. గత కొంతకాలంగా పోలీసులకు చిక్కకుండా పరారీలో ఉన్న ఈ కేసులోని ప్రధాన నిందితురాలు నిదా ఖాన్‌ను ఛత్రపతి సంభాజీనగర్‌లో ఎట్టకేలకు అరెస్టు చేశారు.

నాసిక్ క్రైమ్ బ్రాంచ్, ఛత్రపతి సంభాజీనగర్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో, సంభాజీనగర్‌లోని కౌసర్ పార్క్ ప్రాంతంలో నిదా ఖాన్ ఉన్నట్లు పక్కా సమాచారం అందింది. గురువారం (మే 07) రాత్రి పోలీసులు ఆ ప్రాంతంపై ఆకస్మిక దాడి చేసి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. తన గుర్తింపును దాచిపెట్టి, అత్యంత రహస్యంగా ఒక ఇంట్లో నివసిస్తున్న నిదాను పట్టుకున్నారు పోలీసులు. వెంటనే ఆమెను విచారణ నిమిత్తం నాసిక్‌కు తరలించారు.

నిదా ఖాన్ తలదాచుకున్న ఇంటి వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. స్థానికుల కథనం ప్రకారం.. ఆమె ఉన్న ఇల్లు గత కొన్ని నెలలుగా ఖాళీగానే ఉంది. ఆ ప్రాంత నివాసితులు ఒకరి విషయాల్లో మరొకరు జోక్యం చేసుకోని పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆమె అక్కడ దాక్కుంది. ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ మూసే ఉండేవని, కేవలం ఒక వృద్ధుడు మాత్రమే నిత్యావసరాల కోసం బయటకు వచ్చి వెళ్తుండేవాడని పొరుగువారు తెలిపారు. నిదా ఖాన్ గత నాలుగు ఐదు రోజులుగానే ఆ ఇంట్లో ఉంటున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

నాసిక్ టీసీఎస్ కార్యాలయంలో పని చేస్తున్న పలువురు మహిళా ఉద్యోగులు తమపై జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా బయటపెట్టడంతో ఈ దారుణం వెలుగు చూసింది. నిందితులు మహిళా ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని లైంగిక వేధింపులకు గురిచేయడం, మతమార్పిడి చేసుకోవాలని తీవ్రంగా ఒత్తిడి తీసుకురావడం, మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తూ మానసిక హింస పెట్టడం వంటి చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ వ్యవహారంపై ఇప్పటికే తొమ్మిది ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణను వేగవంతం చేసింది. నిదా ఖాన్ అరెస్టుతో ఈ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఇతర పెద్దల పేర్లు, అనుబంధ సంస్థల వివరాలు బయటకు వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఆమెకు ఆశ్రయం కల్పించిన వారిని, ఈ రాకెట్‌లో భాగస్వాములైన మరికొందరిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us