అందంతో అరాచకం.. మోడ్రన్ లుక్‌లో మెరిసిపోతున్న రుక్మిణి వసంత్

Rajitha Chanti

Pic credit - Instagram

08 May 2026

కన్నడ చిత్రం 'సప్త సాగరదాచై ఎల్లో'తో తన అద్భుతమైన నటన, సహజమైన అందంతో దక్షిణాది ప్రేక్షకులను మాయం చేసిన నటి రుక్మిణి వసంత్.

సాధారణంగా సినిమాల్లో పద్ధతిగా, హోమ్లీ లుక్‌లో కనిపించే రుక్మిణి వసంత్, తాజాగా ఒక కవర్ పేజీ కోసం చేసిన ఫోటోషూట్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఎప్పుడూ చీరకట్టు లేదా చుడీదార్లలో కనిపించే ఈ భామ, ఈసారి ట్రెండీ వెస్ట్రన్ వేర్‌లో కనిపించి నెటిజన్లను కట్టిపడేశారు. ఈ కొత్త ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

మ్యాగజైన్ షూట్ కోసం ఆమె ఇచ్చిన పోజులు ప్రొఫెషనల్ మోడల్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉన్నాయి. ఆమె కళ్ళలో ఆత్మవిశ్వాసం ఈ ఫోటోలకు మరింత అందాన్ని ఇచ్చాయి.

ఈ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసిన నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి. ఆమె అభిమానులు "మా కన్నడ కస్తూరి ఇంత గ్లామరస్‌గా కూడా ఉంటుందా?" కామెంట్స్ చేస్తున్నారు

రుక్మిణి వసంత్ కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటున్నారు. కన్నడలో వరుస విజయాలను అందుకుంటున్నారు. 

 రుక్మిణి వసంత్ 2019లో వచ్చిన కన్నడ చిత్రం 'బీర్బల్'తో వెండితెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే ఆమె పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు.

ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన చిత్రం 'సప్త సాగరదాచై ఎల్లో' (సైడ్-A & సైడ్-B). ఈ సినిమాలోని ఆమె నటన చూసి తెలుగు, తమిళ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.