National: టీచర్‌ కాదు కీచకుడు.. బాలికలకు ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపిస్తూ..

|

Aug 21, 2024 | 12:51 PM

తాజాగా మహారాష్ట్రాలోని అకాలో జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సభ్య సమాజాం తల దించుకునేలా చేసింది. పవిత్రమైన టీచర్‌ వృత్తిలో ఉన్న ఓ ప్రబుద్ధుడు నీచమైన చర్యకు పాల్పడ్డాడు. అకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఆరుగురు బాలికలకు అశ్లీల వీడియోలను చూపిస్తూ లైంగికంగా వేధిస్తూ వచ్చాడు...

National: టీచర్‌ కాదు కీచకుడు.. బాలికలకు ఫోన్‌లో అశ్లీల వీడియోలు చూపిస్తూ..
National News
Follow us on

సమాజంలో రోజురోజుకీ విలువలు పడిపోతున్నాయి. మనిషులు తాము మనుషులమనే విషయాన్ని మర్చిపోయి పశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆమాటకొస్తే మనుషులు చేసే పనులు చూసి పశువులే సిగ్గు పడే పరిస్థితులు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. కోలక్‌కతాలో వైద్యురాలిపై జరిగిన దారుణం మర్చిపోక ముందే. ఇలాంటి మరిన్ని సంఘటనలు అసలు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామన్న ప్రశ్నలను లేవ నెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా మహారాష్ట్రాలోని అకాలో జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన సభ్య సమాజాం తల దించుకునేలా చేసింది. పవిత్రమైన టీచర్‌ వృత్తిలో ఉన్న ఓ ప్రబుద్ధుడు నీచమైన చర్యకు పాల్పడ్డాడు. అకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు ఆరుగురు బాలికలకు అశ్లీల వీడియోలను చూపిస్తూ లైంగికంగా వేధిస్తూ వచ్చాడు. ఇలా నెలల తరబడి జరుగుతోన్న దారుణాన్ని భరించలేని బాలికలు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.

ఆ టీచర్‌ను 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గురించారు. 8వ తరగతికి చెందిన విద్యార్థి ఒకరు శిశు సంక్షేమ కేంద్రం టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి ఘటనపై అధికారులకు సమాచారం అందించడంతో విచారణ ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు, అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గడిచిన నాలుగు నెలలుగా తమకు అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ.. వారిని అనుచితంగా తాకే ప్రయత్నం చేశాడని బాలికలు ఫిర్యాదుల చేశారు.

ఈ క్రమంలోనే మంగళవారం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు పాఠశాలను సందర్శించి కొంతమంది బాలికలతో మాట్లాడారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు ఆశా మిర్గే అతనిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..