దేశవ్యాప్తంగా ఘనంగా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ వరకు వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంటివార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సాధారణంగా ఎవరికైనా ఫోన్ చేసినా, ఫోన్ ఎత్తగానే హలో అంటాం. అయితే ఇకపై అలా అనవద్దని, వందేమాతరం అని అనాలని చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వ అధికారులు, కార్మికులు వీరంతా తమ ఫోన్లు లిఫ్ట్ చేసిన వెంటనే హలో అనకుండా వందేమాతరం అని అనాలని ఆదేశాలు జారీ చేశారు. హలో అనేది ఇంగ్లీష్ పదమని, అందుకే దాన్ని వదులుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. ప్రతి భారతీయుడిలో స్వాతంత్ర్య కాంక్షను రేపిన వందేమాతరం అనేది కేవలం పదం కాదని అది ప్రతి భారతీయుడి గుండె చప్పుడు అని పేర్కొన్నారు. భారతదేశం అంతటా 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. అందుకే అధికారులు హలో అనే పదానికి బదులుగా ఫోన్ ఎత్తగానే వందేమాతరం అని చెప్పాలని తాను కోరుకుంటున్నానని మంత్రి సుధీర్ అన్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు త్వరలోనే విడుదల కానున్నాయని స్పష్టం చేశారు.
#Maharashtra minister Sudhir Mungantiwar directed his officials in the department to start telephonic conversations with ‘Vande Mataram’ instead of greeting a phone call with a ‘hello’
(@sahiljoshii) https://t.co/yUaWLV17oE ఇవి కూడా చదవండి— IndiaToday (@IndiaToday) August 15, 2022
మరోవైపు తీవ్ర ఉద్రిక్తతల మధ్య అధికారం చేపట్టిన ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో కేబినెట్ మంత్రులకు శాఖలు కేటాయించారు. వీరిలో దేవేంద్ర ఫడ్నవీస్ కు డిప్యూటీ సీఎం, హోం శాఖ, ఆర్థిక శాఖలు అప్పగించారు. పట్టణ అభివృద్ధి శాఖ, పబ్లిక్ వర్క్స్ పోర్ట్‌ఫోలియోలను సీఎం షిండే తీసుకున్నారు.కాగా.. ఫోన్ ఎత్తగానే వందేమాతరం అనాలంటూ కామెంట్స్ చేసిన మంత్రి సుధీర్ ముంగంటివార్ అటవీ శాఖను అప్పజెప్పారు.
మరిన్ని స్వాతంత్ర్య దినోత్సవ కథనాల కోసం క్లిక్ చేయండి..