మరికొన్ని రోజుల్లో పెళ్లి.. ఫొటోషూట్‌కి పిలిచి లోయలోకి తోసేసిన కాబోయే భార్య.. ఆ తర్వాత

పెళ్లికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండగా మహారాష్ట్రలో జరిగిన ఓ యువ పారిశ్రామికవేత్త మృతి కేసు సంచలనంగా మారింది. ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు కేతన్ అగ్రవాల్ తన కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా లోహగడ్ కోటకు వెళ్లాడు. ట్రెక్కింగ్ అనంతరం ఫొటోషూట్ చేస్తుండగా కాలు జారి లోయలో పడ్డాడని తొలుత భావించినా, పోలీసుల దర్యాప్తులో ఇది ప్రమాదం కాదని, హత్యగా తేలినట్లు పోలీసులు చెబుతున్నారు.

మరికొన్ని రోజుల్లో పెళ్లి.. ఫొటోషూట్‌కి పిలిచి లోయలోకి తోసేసిన కాబోయే భార్య.. ఆ తర్వాత
Ketan Agrawal's Death Case

Edited By:

Updated on: Jun 23, 2026 | 1:31 PM

మరి కొన్ని రోజుల్లో పెళ్లి.. ఫొటో షూట్ కోసం అమ్మాయి అబ్బాయి వెళ్లారు.. కట్ చేస్తే.. అబ్బాయిలో లోయలో పడి మరణించాడు.. ఫోటో షూట్ కోసం పిలిచి.. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి.. ఆమె ప్రియుడు లోయలోకి తోసేసినట్లు ఆరోపణలు రావడం కలకలం రేపింది. ప్రమాదంగా భావించిన ఘటనలో హత్య వ్యవహారం బయటపడడంతో.. కాబోయే భార్య, ఆమె స్నేహితుడిని పోలీసులు అదుపు తీసుకొని తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో కలకలం రేపింది.. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోహగడ్ కోట వద్ద జరిగిన ఓ యువకుడి మృతి కేసు సంచలన మలుపు తిరిగింది. తొలుత ట్రెక్కింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంగా భావించగా.. పోలీసుల దర్యాప్తులో హత్యగా తేలింది. పెళ్లికి సిద్ధమవుతున్న ఓ యువ పారిశ్రామికవేత్త లోయలో పడి మృతి చెందగా, ఇప్పుడు ఆ మరణం వెనుక ప్రేమ, కుట్ర, నమ్మక ద్రోహంతో ఈ హత్య చేయించారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి

మహారాష్ట్ర పోలీసుల దర్యాప్తులో ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కేతన్ అగ్రవాల్.. తనకు కాబోయే భార్య సియా గోయల్ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో కలిసి లోహగడ్ కోటకు వెళ్లాడు. పెళ్లి సందర్భంగా ఫొటో షూట్ కూడా ప్లాన్ చేసుకున్నారు. ట్రెక్కింగ్ అనంతరం కొండ అంచున ఫోటోలు దిగుతున్న సమయంలో కేతన్ కాలు జారి లోయలో పడిపోయాడని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేసిన మహారాష్ట్ర పోలీసులు అన్ని కోణాల్లో విచారించగా ఈ ఘటనను ప్రమాదవశాత్తూ జరగలేదు ఇందులో ఏదో రహస్యం దాగి ఉంది అంటూ తమదైన శైలిలో విచారణ ప్రారంభించారు.

అయితే లోణావాలా గ్రామీణ పోలీసులు ఘటనపై లోతుగా దర్యాప్తు చేపట్టగా.. అనేక అనుమానాస్పద అంశాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్ ప్రమాదవశాత్తూ పడిపోలేదని, అతడిని ఉద్దేశపూర్వకంగా లోయలోకి తోసివేసి హత్య చేశారని తేలింది. దర్యాప్తులో భాగంగా సియా గోయల్‌కు అత్యంత సన్నిహితుడైన ఓ యువకుడి పాత్రపై పోలీసులు దృష్టి సారించారు. ప్రాథమిక విచారణలో అతడే కేతన్‌ను లోయలోకి తోసినట్లు తేలింది. దీంతో సియా గోయల్‌తో పాటు ఆమె ప్రియుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఈ కేసులో మరో ఆసక్తికర విషయం కూడా ఉంది.. అదే అదేంటంటే సియా గోయల్ ప్రముఖ మసాలా వ్యాపారవేత్త కుమార్తె కాగా, కేతన్ అగ్రవాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త విశాల్ అగ్రవాల్ కుమారుడు. వీరిద్దరి వివాహం త్వరలో జైపూర్‌లో అత్యంత వైభవంగా జరగాల్సి ఉంది. పెళ్లి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తికావచ్చిన దశలో ఉండగా, అతిథుల రాకపోకల కోసం రెండు ప్రత్యేక విమానాలు కూడా బుక్ చేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొస్తున్నారు పోలీసుల విచారణలో సియా అతనితో వివాహం చేసుకోవడం ఇష్టం లేకే ఇలా చేసిందని పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తేలినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఆమె తన స్నేహితుడి సహాయంతో హత్యకు కుట్ర పన్నిందా..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై మహారాష్ట్ర డిజిపి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ పలు విషయాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటివరకు ప్రమాదంగా కనిపించిన ఘటన వెనుక హత్య కోణం బయటపడటంతో ఈ కేసు మహారాష్ట్రలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేతన్ మృతికి అసలు కారణం ఏమిటి? ఇందులో మరెవరైనా ఉన్నారా..? అన్న విషయాలు పోలీసుల తదుపరి దర్యాప్తులో తేలనున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us