సోషల్ మీడియా ఉలిక్కిపడేలా చేసిన ఘటన..! గేమింగ్ యాప్ వేదికగా మరో ‘లవ్ జిహాద్’..!
మహారాష్ట్రలోని అకోలా నగరం మరో ‘లవ్ జిహాద్’ సంచలన ఘటనతో ఉలిక్కిపడింది. నాసిక్, అమరావతి తర్వాత ఇప్పుడు అకోలాలో వెలుగుచూసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒక వివాహితుడైన ముస్లిం వ్యక్తి, గేమింగ్ యాప్ ద్వారా హర్యానాకు చెందిన హిందూ యువతిని వంచించాడు. ఆమె మాయమాటలతో రప్పించి, ఐదు రోజుల పాటు బందీగా ఉంచాడు.

మహారాష్ట్రలోని అకోలా నగరం మరో ‘లవ్ జిహాద్’ సంచలన ఘటనతో ఉలిక్కిపడింది. నాసిక్, అమరావతి తర్వాత ఇప్పుడు అకోలాలో వెలుగుచూసిన ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒక వివాహితుడైన ముస్లిం వ్యక్తి, గేమింగ్ యాప్ ద్వారా హర్యానాకు చెందిన హిందూ యువతిని వంచించాడు. ఆమె మాయమాటలతో రప్పించి, ఐదు రోజుల పాటు బందీగా ఉంచాడు. యువతి కుటుంబసభ్యులతో ఫిర్యాదుతో అసలు బండారం బయటపడింది.
నిందితుడిని అకోలాకు చెందిన జమీర్ జహిరుద్దీన్ ఖాజీగా గుర్తించారు. ఇతనికి అప్పటికే వివాహమై ఒక బిడ్డ కూడా ఉన్నాడు. అయితే, ఇతను గేమింగ్ యాప్‌లో ‘బాద్‌షా’ అనే మారుపేరుతో నకిలీ ఖాతాను సృష్టించి, యువతులకు వల వేయడం అలవాటుగా మార్చుకున్నాడు. ఈ క్రమంలోనే హర్యానాకు చెందిన ఒక హిందూ యువతితో పరిచయం పెంచుకున్నాడు. ఆ యువతికి తన కుటుంబ సభ్యులతో చిన్నపాటి గొడవ జరగడాన్ని ఆసరాగా తీసుకున్న జమీర్, ఆమెకు ‘బ్రెయిన్ వాష్’ చేసి, ప్రేమ పేరుతో నమ్మించి అకోలాకు రప్పించుకున్నాడు. అకోలాలోని గీతా నగర్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఆమెను ఐదు రోజుల పాటు బంధించినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
యువతి అదృశ్యంపై హర్యానాలో ఇప్పటికే కేసు నమోదైంది. ఆమె ఆచూకీ కోసం వెతుకుతూ అకోలా చేరుకున్న యువతి సోదరుడు, స్థానిక ఖదాన్ పోలీసులను ఆశ్రయించడంతో గుట్టు రట్టయింది. పోలీసులు వెంటనే స్పందించి నిందితుడి నివాసంపై దాడి చేసి యువతిని సురక్షితంగా రక్షించారు. ఈ ఘటన విషయం తెలియగానే విశ్వ హిందూ పరిషత్ (VHP) కార్యకర్తలు భారీ సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన ‘లవ్ జిహాద్’ అని ఆరోపిస్తూ ఆందోళనకు దిగడంతో ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ప్రస్తుతం నిందితుడు జమీర్ ఖాజీ పోలీసుల అదుపులో ఉన్నాడు. హర్యానా పోలీసులు అకోలాకు చేరుకోగా, నిందితుడిని, బాధితురాలిని తదుపరి విచారణ నిమిత్తం వారికి అప్పగించనున్నారు. కేవలం గేమింగ్ యాప్స్ ద్వారా యువతులను ఆకర్షించి ఇలాంటి అకృత్యాలకు పాల్పడుతున్న ముఠాల వెనుక ఉన్న మూలాలను వెలికితీయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటన సోషల్ మీడియా, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగంపై మరోసారి ఆందోళన రేకెత్తించింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
