Maharashtra Corona Update: మహారాష్ట్రాలో తగ్గుముఖం పట్టని కరోనా మహమ్మారి.. పెరుగుతున్న కేసులు

Maharashtra Corona Update: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టినా.. మహారాష్ట్రలో...

Maharashtra Corona Update: మహారాష్ట్రాలో తగ్గుముఖం పట్టని కరోనా మహమ్మారి.. పెరుగుతున్న కేసులు

Updated on: Feb 16, 2021 | 1:37 PM

Maharashtra Corona Update: మహారాష్ట్రలో కరోనా వైరస్‌ తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గుముఖం పట్టినా.. మహారాష్ట్రలో మాత్రం పాజిటివ్‌ కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు వేలల్లో కేసులు నమోదు అవుతున్నాయి. సోమవారం కొత్తగా 3,365 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 23 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,67,643కు చేరగా, మరణాలు 51,552కు చేరుకున్నాయి.

మరో వైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 3,105 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య19,78,708కి చేరినట్లు అక్కడి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్రలో 36,201 యాక్టివ్‌ కేసులున్నట్లు వెల్లడించింది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలలో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నా.. అన్‌లాక్‌ ప్రక్రియలో మళ్లీ కేసుల సంఖ్య పెరిగిపోతోంది.

Also Read: India Corona: దేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి.. గడిచిన 24 గంటల్లో ఎన్ని కేసులు, మరణాలు నమోదయ్యాయంటే..