ఎన్నికల అఫిడవిట్లలో ‘తకరారు’, చిక్కుల్లో మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ?

| Edited By: Anil kumar poka

Sep 21, 2020 | 11:58 AM

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, మంత్రి కూడా అయిన ఆదిత్య థాక్రే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తప్పుడు ఎన్నికల అఫిడవిట్లు దాఖలు చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలన్న తమ అభ్యర్థన గురించి ఎన్నికల కమిషన్..

ఎన్నికల అఫిడవిట్లలో తకరారు,  చిక్కుల్లో మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే ?
Follow us on

మహారాష్ట్ర సీఎం ఉధ్ధవ్ థాక్రే, ఆయన కుమారుడు, మంత్రి కూడా అయిన ఆదిత్య థాక్రే, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తప్పుడు ఎన్నికల అఫిడవిట్లు దాఖలు చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరపాలన్న తమ అభ్యర్థన గురించి ఎన్నికల కమిషన్.. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుకు గుర్తు చేసింది. నెల రోజుల క్రితమే ఈసీ దీనిపై ఈ బోర్డుకు ఓ లేఖ పంపింది.. ఈ ముగ్గురు సమర్పించిన అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అప్పుల విషయాన్ని  వెరిఫై చేయాలని కూడా కోరింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని 125 ఏ సెక్షన్ ప్రకారం.. ఈ అఫిడవిట్లలో ఏదైనా అవాస్తవం ఉందని తేలితే సదరు అభ్యర్థికి ఆరు నెలల జైలు శిక్ష లేదా జరిమానా, లేదా రెండూ విధిస్తారు. అబధ్ధాల అఫిడవిట్లపై తీవ్ర చర్య తీసుకుంటామని ఎన్నికల కమిషన్ హెచ్చరించింది. . ఇదే సమయంలో పన్నుల బోర్డుతో కూడా ‘టచ్’ లో ఉంటోంది. మరి ఉధ్ధవ్, ఆయన కొడుకు ఆదిత్య, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే వాస్తవ అఫిడవిట్లే సమర్పించారా లేక అవాస్తవాల తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారా అన్న విషయం ప్రత్యక్ష పన్నుల బోర్డు విచారణ లేదా దర్యాప్తులో తేలనుంది.