Three Language Policy: మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. త్రిభాష విధానంపై జీఆర్‌ల ఉపసంహరణ!

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం వ్యాప్తంగా స్కూలు పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ గత ఏప్రిల్ 16వ తేదీన చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కితీసుకుంది. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు స్వయంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.

Three Language Policy: మహారాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. త్రిభాష విధానంపై జీఆర్‌ల ఉపసంహరణ!
Mh

Updated on: Jun 29, 2025 | 10:23 PM

మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం వ్యాప్తంగా స్కూలు పాఠ్యాంశాల్లో హిందీని తప్పనిసరి చేస్తూ గత ఏప్రిల్ 16వ తేదీన చేసిన తీర్మానాన్ని ప్రభుత్వం వెనక్కితీసుకుంది. ఫడ్నవీస్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన సారథ్యంలోని ప్రభుత్వం రాష్ట్రంలో త్రిభాషా విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది.ఈ మేరకు గత ఏప్రిల్ 16న ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ తీర్మానం ప్రాకరం..రాష్ట్రంలోని 1 నుంచి 5వ తరగతి వరకూ ఉన్న ఇంగ్లీషు, మరాఠీ మీడియం స్కూళ్లలో హిందీ భాషను తప్పనిసరి చేస్తున్నట్టు పేర్కొంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో జూన్ 17న తీర్మానాన్ని సవరించింది. అయినా ప్రజల్లో ఈ అంశంపై వ్యతిరేకత తగ్గకపోవడంతో రాష్ట్రంలో త్రిభాషా విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం చేసిన రెండు తీర్మానాలను రద్దు వెనక్కితీసుకునేందుకు కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెల్లడించారు.

మరోవైపు రాష్ట్రంలో త్రిభాషా విధానం అమలు చేసే అంశంపై చర్చించేందుకు విద్యావేత్త నరేంద్ర జాదవ్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ కమిటీ తిభ్రాషా విధానంపై అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పింస్తుందని ఆయన తెలినారు. అప్పటి వరకూ ఏప్రిల్ 16, జూన్ 17న తీసుకున్న జీఆర్‌లను ప్రభుత్వం రద్దు చేస్తున్నట్టు సీఎం ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..