Madhya Pradesh: వద్దన్నా వినకుండా మహిళల ముందు నగ్నంగా నిల్చున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..

|

Aug 08, 2022 | 9:48 AM

Madhya Pradesh: మహిళల ముందు నగ్నంగా నిల్చుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌కు నిప్పటించారు ఇద్దరు వ్యక్తులు.

Madhya Pradesh: వద్దన్నా వినకుండా మహిళల ముందు నగ్నంగా నిల్చున్నాడు.. కట్ చేస్తే దిమ్మతిరిగే ట్విస్ట్..
Man
Follow us on

Madhya Pradesh: మహిళల ముందు నగ్నంగా నిల్చుంటూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌కు నిప్పటించారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటనలో బాధిత వ్యక్తి ప్రైవేట్ పార్ట్ 20 శాతం కాలిపోగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లా కజ్లీ గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసు అధికారులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కజ్లీ గ్రామానికి చెందిన దీప్‌చంద్ అనే వ్యక్తి మహిళలను వేధిస్తూ ఉండేవాడు. వారి ముందు నగ్నంగా నిలబడి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీనిపై అతన్ని అనేకసార్లు హెచ్చరించినప్పటికీ మార్పు రాలేదు. తాజాగా కూడా గ్రామంలోని కొందరు మహిళ ముందుకు వచ్చిన దీప్‌చంద్.. తన దుస్తులను విప్పేసి ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వారిని వేధింపులకు గురి చేశాడు. దాంతో ఆ మహిళలు గ్రామస్తులకు చెప్పారు. పక్కనే ఉన్న సుదేష్, కృష్ణ అనే వ్యక్తులు.. దీప్‌చంద్‌ను వారించారు. అయినప్పటికీ వినకపోవడంతో.. అతని ప్రైవేట్ పార్ట్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతను ఆస్పత్రిలో చేరాడు. బాధిత వ్యక్తి ప్రైవేట్ పార్ట్ 20 శాతం కాలిపోయిందని, అతనికి చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. కాగా, దీప్‌చంద్‌కు నిప్పంటించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఇండియన్ పీనల్ కోడ్ 324, 506 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..