భార్య చేసే ఖర్చులు భరించలేక.. రోడ్డు యాక్సిడెంట్‌లో చంపేసిన భర్త!

|

Aug 26, 2024 | 9:08 PM

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నివాసం ఉంటున్న హేమంత్‌ శర్మ, దుర్గావతిలకు 2021లో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అప్పటికే వేర్వేరు వ్యక్తులతో ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. హేమంత్‌ పెళ్లయిన ఏడాదికే భార్యతో విడిపోగా.. భర్త నుంచి విడాకులు తీసుకొన్న దుర్గావతి.. 2022లో వివాహం చేసుకున్నారు. చట్టబద్దంగా దుర్గావతికి విడాకులు మంజూరైన తర్వాత 2023లో అధికారికింగా హేమంత్‌ శర్మ, దుర్గావతి మరోమారు..

భార్య చేసే ఖర్చులు భరించలేక.. రోడ్డు యాక్సిడెంట్‌లో చంపేసిన భర్త!
Man Killed Wife
Follow us on

గ్వాలియర్‌, ఆగస్టు 26: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. విలాసవంతమైన జీవనశైలికి అలవాటుపడి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చుచేస్తున్న భార్యతో ఓ భర్త వేగలేక పోయాడు. పక్కా ప్లానుతో భార్యను కడతేర్చి, రోడ్డు యాక్సిడెంట్‌గా నమ్మబలికాడు. పోలీసుల ఎంట్రీతో అడ్డంగా బుక్కైపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నివాసం ఉంటున్న హేమంత్‌ శర్మ, దుర్గావతిలకు 2021లో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే అప్పటికే వేర్వేరు వ్యక్తులతో ఇద్దరికీ పెళ్లిళ్లు జరిగాయి. హేమంత్‌ పెళ్లయిన ఏడాదికే భార్యతో విడిపోగా.. భర్త నుంచి విడాకులు తీసుకొన్న దుర్గావతి.. 2022లో వివాహం చేసుకున్నారు. చట్టబద్దంగా దుర్గావతికి విడాకులు మంజూరైన తర్వాత 2023లో అధికారికింగా హేమంత్‌ శర్మ, దుర్గావతి మరోమారు పెళ్లి చేసుకున్నారు. అయితే దుర్గావతి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టేది. దీంతో శర్మ ఆర్ధికంగా బాగా దెబ్బతిన్నాడు. దీంతో వీరి మధ్య పొరపొచ్చాలు వచ్చాయి. దుర్గావతి తీరుతో విసుగు చెందిన శర్మ ఆమెను అంతమొందించాలని పథకం పన్నాడు. స్నేహితుడు, మరో వ్యక్తితో కలిసి ప్లాన్‌ అమలు చేశాడు. అందుకు ఏకంగా రూ.2.5 లక్షలు సుపారీ కూడా ఇచ్చాడు.

ఆగస్టు 13న శర్మ.. తన భార్య దుర్గావతి, ఆమె సోదరుడు సందేశ్‌ను తీసుకుని ఓ గుడికి వెళ్లాడు. తిరిగి వస్తుండగా శర్మ ముందుగా ఏర్పాటు చేసిన ఇద్దరు వ్యక్తులు దుర్గావతి, సందేశ్‌లు ప్రయాణిస్తున్న బైక్‌ను ఉద్దేశ్యపూర్వకంగా కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దుర్గావతి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, సందేశ్‌కు గాయాలయ్యాయి. తొలుత దీనిని హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు 10 రోజుల తర్వాత అసలు విషయం వెలికి తీశారు. పొంతనలేని శర్మ మాటలపై అనుమానం వచ్చిన పోలీసులు.. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందు బైకును అనుసరిస్తున్న కారు కనిపించింది. దీంతో హత్యోదంతం మిస్టరీ వీడింది. ఈ హత్య కేసులో శర్మతో సహా కారుతో ఢీ కొట్టిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు నిందితులుగా గుర్తించినట్లు అడిషనల్ పోలీసు సూపరింటెండెంట్ నిరంజన్ శర్మ మీడియాకు తెలిపారు. శర్మ, కారు డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.