LPG Price in India Today : సామాన్యులకు భారీ షాక్ ఇచ్చింది కేంద్రం. గ్యాస్ సిలిండర్ ధరను ఒక్కసారిగా పెంచేసింది. ఒక్కో సిలిండర్(14.2కేజీ ) ధర పై రూ. 50 రూపాయలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు ఇవాల్టి నుంచే అమల్లోకి రానున్నాయి. సిలిండర్ పైన రూ.50 రూపాయలు పెంచడంతో సామాన్యులపై భారం పడనుంది. దేశరాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ.769కి చేరింది. గడిచిన ఆరు నెలలుగా చమురు ధరలు ఆందోళనకరంగా పెరుగుతుండటం, ఆ తర్వాత దాని ఎఫెక్ట్ ఇప్పుడు గ్యాస్ పై కూడా పడింది. అసలే పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యుల పై కేంద్రం సిలిండర్ రూపంలో మరో భారంవేసింది.
మరిన్ని ఇక్కడ చదవండి :