LPG Cylinder Price in India: కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను భారీగా తగ్గించాయి. దేశంలోని ప్రధాన గ్యాస్ కంపెనీలు.. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను రూ. 198 తగ్గించాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లకు ఈ తగ్గిన ధర వర్తిస్తుంది. కాగా, 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించిన తర్వాత రాజధాని ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర రూ.2,219 నుంచి రూ.2021కి తగ్గింది. గత నెల జూన్‌లో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించారు. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను చమురు కంపెనీలు రూ.136 తగ్గించాయి.
డొమెస్టిక్ సిలిండర్ ధరలు..
ఢిల్లీలో 14.2 కిలోల నాన్ సబ్సిడీ సిలిండర్ ధర రూ.1,003. ముంబైలో డొమెస్టిక్ కిచెన్ సిలిండర్ ధర రూ. 1002.5. కోల్‌కతాలో దీని ధర రూ.1,029, చెన్నైలో రూ.1018.5 గా ఉంది.
తగ్గిన ధరలతో కమర్షియల్ సిలిండర్ ధరలు ఏ పట్టణంలో ఎలా ఉన్నాయంటే..
నేటి నుంచి 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.198 తగ్గింది. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో 198 తగ్గగా.. రూ.2,021కి అందుబాటులో ఉంది. ఇదే సమయంలో కోల్‌కతాలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.182 తగ్గింది. ఇక్కడ ఇప్పుడు ధర రూ.2,140 అందుబాటులో ఉంది. అంతకుముందు ధర రూ.2,322 గా ఉండేది.
ముంబైలో ఇప్పుడు సిలిండర్ ధర రూ.2,171.50 నుంచి రూ.1,981కి తగ్గింది. ఇక్కడ ధరలు రూ.190.5 తగ్గాయి. చెన్నైలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ.2,186కి అందుబాటులో ఉంది. ఇంతకు ముందు దీని ధర రూ.2,373. అంటే ఇక్కడ సిలిండర్ ధర రూ.187 తగ్గింది.
గ్యాస్ సిలిండర్ ధరను ఇలా చెక్ చేయండి..
LPG సిలిండర్ ధరను చెక్ చేయడానికి, ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు సంస్థ IOC వెబ్‌సైట్‌కు వెళ్లాలి. కంపెనీలు ప్రతి నెలా కొత్త రేట్లు విడుదల చేస్తాయి. (https://iocl.com/Products/IndaneGas.aspx) ఈ లింక్‌లో మీరు మీ నగరంలోని గ్యాస్ సిలిండర్‌ల ధరను చెక్ చేయవచ్చు.