ఇదేం డ్రైవింగ్‌రా అయ్యా.. యాక్సిలరేటర్‌పై వాటర్ బాటిల్, స్టీరింగ్ వీల్‌ను తాడుతో కట్టేసి.. కట్‌చేస్తే..

|

Feb 01, 2023 | 11:09 AM

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి ప్రమాదకరమైన డ్రైవింగ్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఘాటైన విమర్శల వర్షం కురిపించారు.

ఇదేం డ్రైవింగ్‌రా అయ్యా.. యాక్సిలరేటర్‌పై వాటర్ బాటిల్, స్టీరింగ్ వీల్‌ను తాడుతో కట్టేసి.. కట్‌చేస్తే..
Lorry Driver
Follow us on

మనదేశంలో జూగాడులకు కొదువే లేదు. ఏ పని చేసిన అందులో ఏదో ఒక ట్రిక్‌ ప్లే చేస్తూ.. పనిని సులభం చేసుకోవటంలో మనోళ్లకు ఎవరూ సాటిలేరు. రోజూ కూలీ నుంచి వ్యవసాయం చేసుకునే రైతులు, డ్రైవర్ల వరకు టెక్నిక్‌తో పని చేస్తుంటారు. అలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తుంటాం.. తాజాగా ఓ లారీ డ్రైవర్‌ చేసిన పనికి నెటిజన్లు నోరెళ్ల బెడుతున్నారు. ఎందుకంటే.. ఇక్కడ ఒక లారీలో… డ్రైవింగ్ సీటు వెనుక కూర్చున్న డ్రైవర్ లారీ స్టీరింగ్‌ను తాడుతో కట్టేశాడు. డ్రైవర్ యాక్సిలరేటర్‌పై వాటర్ బాటిల్‌ పెట్టి కూల్‌గా కూర్చున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో చూసి అందరూ షాక్ అయ్యారు. ఇలాంటి ప్రమాదకరమైన డ్రైవింగ్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఘాటైన విమర్శల వర్షం కురిపించారు.

అయితే, ఈ వైరల్ వీడియోకు సంబంధించిన ఘటన కేరళలో జరిగినట్టుగా తెలిసింది. వీడియో వైరల్‌ కావటంతో… లారీ ప్రయాణం వెనుక కారణాన్ని కేరళ పోలీసులు కనుగొన్నారు. పోలీసులు విచారించగా.. రో-రో సర్వీస్‌లో ప్రయాణిస్తున్న లారీ, రైలులో కార్గో లారీలు తరలిస్తున్న దృశ్యాలుగా గుర్తించారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు ఆ వైరల్ ట్రిప్ చేసిన డ్రైవర్‌ను విచారించగా, రైలులో ప్రయాణిస్తుండగా, ఏదో సరదాగా వీడియో తీశానని డ్రైవర్ చెప్పాడు. ఆఖరుకు వీడియో మరోమారు చూడగా, అప్పుడు ఆ వేగం స్పష్టంగా అర్థమవుతోంది. ఫ్యామిలీ గ్రూప్‌లో వీడియో పోస్ట్ చేయబడింది. ఫేస్‌బుక్‌లో ఎవరు పెట్టారో తెలియదుగానీ, స్టీరింగ్‌ తాడుతో కట్టేసి రోడ్డుపైకి వెళ్లలేరు. వంద మీటర్లు కూడా వాహనం నడపలేనని డ్రైవర్ చెబుతున్న వీడియోను కేరళ పోలీసులు తన అధికారిక ఫేస్ బుక్ పేజీలో విడుదల చేశారు.

సోషల్ మీడియాలో చూసే వాటిని గుడ్డిగా నమ్మవద్దనే క్యాప్షన్‌తో కేరళ పోలీసులు ఈ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, చాలా మంది కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..